మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక కొణిదెల. పెళ్లి అయినా నటి కావాలన్న తన కోరిక కొనసాగిస్తోంది. కట్టుకున్నవాడిని, అత్తమామలను ఒప్పించి ఆ దిశగా అడుగులు వేస్తుంది.
సినిమా ఓ గ్లామర్ ఫీల్డ్. హీరోయిన్ గా ఎదగాలంటే ఫోటో షూట్స్ తప్పనిసరి. దర్శక నిర్మాతలను ఆకట్టుకోవాలంటే హీరోయిన్స్ తప్పక చేయాల్సిన పని. నిహారిక సైతం అదే చేస్తున్నారు. కుదిరినప్పుడల్లా సరికొత్త ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.
28
Niharika Konidela
తాజాగా మిల్కీ వైట్ ట్రెండీ వేర్ ధరించి సూపర్ స్టైలిష్ గా సిద్ధమయ్యారు. ఆమె లేటెస్ట్ లుక్ కట్టిపడేస్తుంది. ఇక ఆమె గ్లామర్ చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.
38
Niharika Konidela
ఇక నిహారిక(Niharika Konidela) నిర్మాతగా, నటిగా కొనసాగుతున్నారు. నిజానికి నిహారిక హీరోయిన్ కావడం కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. అందుకే ఆమెకు అంతగా ప్రోత్సాహం లభించలేదు.
48
Niharika Konidela
ఒక మనసు మూవీతో నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చే ఒక్క హిట్ కూడా పడలేదు. సైరా మూవీలో నిహారిక చిన్న క్యామియో రోల్ చేశారు.
58
Niharika Konidela
హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో నాగబాబు కండీషన్ ప్రకారం పెళ్ళికి ఒప్పుకుంది. బుద్దిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. 2020 డిసెంబర్ నెలలో నిహారిక వివాహం ఘనంగా జరిగింది.
68
ప్రస్తుతం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నిర్మాతగా వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. గతంలో కూడా నిహారిక పింక్ ఎలిఫేంట్ బ్యానర్ లో నాన్న కుచ్చి, మాడ్ హౌస్ వంటి సిరీస్లు నిర్మించారు.
78
ఈ మధ్య నిహారిక విమర్శల పాలయ్యారు. లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న నిహారిక అధికారుల దాడిలో పట్టుబడ్డారు. పోలీసులు ఆమెను స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ పబ్ లో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు లభించగా విచారణ ఎదుర్కొన్నారు.
88
ఈ ఆరోపణలు నాగబాబు ఖండించారు. నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయినప్పటికీ నిహారిక సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యారు. ఇక ఎవరు ఏమన్నా పట్టించుకోని నిహారిక తన కలలు వైపు అడుగులేస్తూ ముందుకు వెళుతుంది.