Niharika Konidela: విడాకుల తర్వాత అలా ఫీల్ అవుతున్న నిహారిక... పెళ్లి బలవంతంగా చేశారా?

First Published | Nov 26, 2023, 12:57 PM IST

ఇటీవల మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. భర్తతో విడిపోయాక ఆమెలో కొన్ని మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నెటిజెన్స్ ఇదే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

Niharika Konidela

మెగా ఫ్యామిలీ నుండి అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక కొణిదెల. ఆమె యుద్ధం చేసి నటిగా మారింది. కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ హీరోయిన్ కావడానికి వీల్లేదని అడ్డుకున్నారు. నిహారిక పట్టుబట్టి తన పంతం నెగ్గించుకుంది. 

Niharika Konidela

ఒక మనసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఎమోషనల్ లవ్ డ్రామాగా ఒక మనసు తెరకెక్కింది. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఒక మనసు ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. 


Niharika Konidela

హీరోయిన్ గా ఆమెకు బ్రేక్ రాలేదు. దాంతో నాగబాబు వివాహం చేశాడు. 2020 డిసెంబర్ నెలలో వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రెండేళ్లు హ్యాపీగా ఉన్న ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇద్దరూ విడిపోయారు. 2023 ప్రారంభంలో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

Niharika Konidela

విడాకులు అనంతరం నిహారికలో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె స్వేచ్ఛగా ఫీల్ అవుతుంది. తన డ్రీమ్స్ వెనుక పరుగెడుతోంది. ఫ్రెండ్స్ తో హ్యాపీగా గడుపుతుంది. ఇవన్నీ గమనిస్తుంటే... పెళ్లిని ఆమె సంకెళ్లుగా భావించారు. అత్తింటి వారు తన డ్రీమ్స్ కి అడ్డుపడుతుండగా విడాకులకు మొగ్గు చూపిందని తెలుస్తుంది. 

Niharika Konidela

నటించకూడదు, సినిమా పరిశ్రమకు దూరంగా ఉండాలన్న అత్తింటివారి షరతుల కారణంగానే నిహారిక భర్తతో విడిపోయారని అంటున్నారు. విడాకులు అయిన వెంటనే నిహారిక హైదరాబాద్ లో ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసింది. పెళ్లికి ముందే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ స్థాపించింది. ఈ బ్యానర్లో నిహారిక ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటుంది. 

Niharika Konidela

నటిగా కూడా రాణించాలి అనేది ఆమె కోరిక. విడాకుల అనంతరం నిహారిక డెడ్ ఫిక్సెల్స్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. హాట్ స్టార్ లో ఇది స్ట్రీమ్ అవుతుంది. త్వరలో నిర్మాతగా, నటిగా ఆమె మరిన్ని ప్రాజెక్ట్స్ చేయనుంది. 

Niharika Konidela

ఇటీవల నిహారిక ఇంట్లో శుభకార్యం చోటు చేసుకుంది. అన్నయ్య వరుణ్ తేజ్ వివాహం జరిగింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ వివాహం చేసుకున్నారు. ఇటలీ దేశంలో మూడు రోజుల పాటు వరుణ్-లావణ్యల వివాహం జరిగింది. ఈ పెళ్లిలో నిహారిక సందడి చేశారు. 
 

Latest Videos

click me!