ఒకే ఫ్రేమ్ లో మెగా అండ్ అల్లు ఫ్యామిలీ.. ఫ్యాన్స్ కడుపునింపే ఫొటోలు.. అఖిరా, ఆద్య ఎలా ఉన్నారో చూశారా!

Published : Jan 15, 2024, 03:19 PM IST

మెగా స్టార్ చిరంజీవి Chiranjeevi తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యామిలీ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఫ్యాన్స్ కు ఈఫొటోలు సర్ ప్రైజింగ్ గా మారాయి.   

PREV
15
ఒకే ఫ్రేమ్ లో మెగా అండ్ అల్లు ఫ్యామిలీ.. ఫ్యాన్స్ కడుపునింపే ఫొటోలు.. అఖిరా, ఆద్య ఎలా ఉన్నారో చూశారా!

తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ది అనే చెప్పాలి. అల్లు వారి ఫ్యామిలీ, చిరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

25

ఈ సందర్భంగా మెగా అభిమానులకు, అల్లు వారి అభిమానులకు సంక్రాంతి వేళ అదిరిపోయే సర్ ప్రైజ్ అందింది. ఎన్నోఏళ్లుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నవిధంగా ఇరు కుటుంబ సభ్యులు ఓకే చోట కనిపించారు. 

35

మెగా, అల్లు వారి ఫ్యాన్స్ కు చిరంజీవి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. చిరు ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ Allu Aravind ఫ్యామిలీ సభ్యులంతా ఓకేఫ్రేమ్ లో కనిపించారు. ఇక రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కూడా ఓ ఫొటోను పంచుకుంది. 

45

ఫ్యామిలీ ఫొటోలో చిరు, నాగబాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజావైష్ణవ్ తేజ్, కొత్త కోడలు లావణ్య త్రిపాఠి, అల్లు స్నేహా రెడ్డి, ఉపాసన కొణిదెలతో పాటు కూతుర్లు, మనవరాళ్లు, మనవళ్లు, బంధువులంతా ఉన్నారు... కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. 

55

ఇక ఈ మెగా, అల్లు ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan  కొడుకు అకిరా నందన్ Akhira Nandhanతోపాటు కూతురు ఆద్య Aadhya  కూడా కనిపించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫొటోలను మెగా సభ్యులంతా అభిమానులతో పంచుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories