Gunturkaaram 3 days Collections.. `గుంటూరు కారం` కలెక్షన్లలో ఊహించని ట్విస్ట్.. ఇది మహేష్‌ మ్యాజికేనా?

First Published Jan 15, 2024, 2:18 PM IST

మహేష్‌బాబు `గుంటూరు కారం` ఈ సంక్రాంతికి వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. భారీ పోటీ, బీభత్సమైన నెగటివిటీ మధ్య ఈ సినిమా మంచి కలెక్షన్లని రాబడుతుండటం విశేషం. 
 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఈ సంక్రాంతికి `గుంటూరు కారం` చిత్రంతో సందడి చేశారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి తొలుత భారీగా నెగటివ్‌ టాక్‌  వచ్చింది. చాలా వరకు నెగటివ్‌ టాక్‌ని స్ప్రెడ్‌ అయ్యింది. వాంటెడ్‌గా దీనిపై నెగటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేసినట్టు తెలుస్తుంది. ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ మూవీపై బాగా నెగటివ్‌ టాక్‌ని విస్తరించారు. దీంతో సినిమాపై బాగా ప్రభావం పడింది. రెండో రోజు కలెక్షన్లు తగ్గడానికి కారణమయ్యింది. 
 

ఇదిలా ఉంటే ఈ మూవీ భారీ నెగటివ్‌ టాక్‌ మధ్య మొదటి రోజు 94కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది. రెండో రోజు 33కోట్లు వచ్చాయి. ఇప్పుడు మూడో రోజు 37కోట్లు రాబట్టింది. ఇక పూర్తిగా మూడు రోజుల్లో ఈ మూవీ 164కోట్ల గ్రాస్‌ చేసింది. ఎనభై కోట్లకుపైగా షేర్‌ రాబట్టడం విశేషం. ఇక ఈ మూవీ 132 కోట్ల బిజినెస్‌ చేసింది. బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇంకా యాభై కోట్ల వరకు షేర్‌ రావాలి. అంటే వందకోట్లు  వసూలు చేయాలి. 
 

Latest Videos


ఇదిలా ఉంటే రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్లు పెరగడం ఆశ్చర్యపరుస్తుంది. ఆదివారం కొత్తగా `నా సామిరంగ` మూవీ విడుదలైంది. వాస్తవానికి కలెక్షన్లు తగ్గాలి. కానీ పెరిగాయి. ఇప్పుడు మరింతగా పెరుగుతున్నాయట. దీంతో ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ పెరుగుతున్నట్టు తెలుస్తుంది. టాక్‌ ఏదేమైనా ఈ మూవీ పండగ రోజుల్లో కొదవలేదు. 

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `గుంటూరు కారం` చిత్రం వచ్చింది. చాలా గ్యాప్‌తో ఈ కాంబో రిపీట్‌ అయ్యింది. గతంలో `అతడు`, `ఖలేజా` చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మీనాక్షి చౌదరి చిన్న పాత్రలో మెరిసింది. రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్‌, రావు రమేష్‌, రాహుల్‌ రవీంద్రన్‌ ఇతర పాత్రల్లో మెరిశారు. 
 

మదర్‌ సెంటిమెంట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు త్రివిక్రమ్‌. రమ్యకృష్ణ చిన్నప్పుడు కొడుకుని వదలేసి తండ్రి వద్దకు వస్తుంది. తండ్రి కోరిక మేరకు ఆయన చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని రాజకీయాల్లో ఎదుగుతుంది. మంత్రి అవుతుంది. రాష్ట్ర రాజకీయాలను  శాషిస్తుంది. ఈ నేపథ్యంలో తండ్రి కోసం ఆమె ఏం చేసింది, దూరమైన తల్లి కోసం మహేష్‌ ఏం చేశారనేది కథ. తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించడం విశేషం. ఈ మూవీని హారికా  అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు.
 

click me!