మళ్లీ భగ్గుమన్న `మెగా` విభేదాలు.. అల్లు అరవింద్‌ స్పందించిన రెండు రోజులకే.. బన్నీ ఇలా చేశాడేంటి?

Published : Sep 03, 2022, 07:28 PM ISTUpdated : Sep 03, 2022, 08:36 PM IST

మెగా, అల్లు వారి మధ్య విభేదాలు నెలకొన్నట్టు గత కొంత కాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్‌ వ్యవహరించిన తీరుతో మళ్లీ ఆ విభేదాలకు ఆజ్యం పోసినట్టయ్యిందంటున్నారు నెటిజన్లు. 

PREV
16
మళ్లీ భగ్గుమన్న `మెగా` విభేదాలు.. అల్లు అరవింద్‌ స్పందించిన రెండు రోజులకే.. బన్నీ ఇలా చేశాడేంటి?

అల్లు అర్జున్‌ తాను మెగా హీరో కాదని, తాను అల్లు హీరో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ నుంచి, మెగా ఇమేజ్‌ నుంచి ఆయన దూరంగా ఉండాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. గతంలో ఓ ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్‌ గురించి చెప్పాలని అభిమానులు కోరగా, `చెప్పను బ్రదర్‌` అని స్టేజ్‌ పై నుంచే కామెంట్‌ చేశారు బన్నీ. ఇటీవల అల్లు రామలింగయ్య ఫోటో షేర్‌ చేస్తూ `ఫౌండేషన్‌` అనే క్యాప్షన్‌ ఇచ్చారు. 
 

26

ఇవన్నీ చూస్తుంటే అల్లు అర్జున్‌ తాను మెగా చెట్టు కింద మొక్కని కాదని, అల్లు అనే వృక్షం కింది చెట్టునని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాల గురించి వార్తలు పెరగడంతో అల్లు అరవింద్‌ స్పందించారు. వాటికి ఫుల్‌ స్టాప్‌పెట్టే ప్రయత్నం చేశారు. అందరు పెద్ద వాళ్లు అయ్యారని, ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉన్నారని, దీని కారణంగా కలుసుకోవడం కుదరడం లేదన్నారు. కావాలనే కొందరు తమ ఫ్యామిలీలపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. 

36

దీంతో అంత సర్దుకుందని అంతా భావించారు. కానీ కొత్త వివాదం పుట్టుకొచ్చింది. నిన్న(సెప్టెంబర్‌ 2) పవన్‌ కళ్యాణ్‌పుట్టిన రోజు. చిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకు విషెస్‌ తెలిపింది. రాజకీయ ప్రముఖులు, ఇతర ఇండస్ట్రీల వాళ్లు కూడా విషెస్‌ చెప్పారు. కానీ బన్నీ బర్త్ డే విషెస్‌చెప్పకపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా అందరు విషెస్‌ చెబుతున్నారు. కానీ బన్నీ నుంచి పవన్‌కి విషెస్‌ చెబుతూ ఎలాంటి పోస్టులు లేవు. దీంతో మళ్లీ విభేదాలు అనే అంశం తెరపైకి వచ్చింది. 
 

46

పవన్‌ని కావాలనే బన్నీ దూరం పెడుతున్నారనే వాదన ఊపందుకుంది. ఆయన విషయంలో బన్నీ వ్యవహార శైలి కూడా అలానే ఉండటంతో ఇది నిజమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ బన్నీపై విరుచుకుపడుతున్నారు. విషెస్‌ చెప్పకపోవడంపై ఆయన తీరుని విమర్శిస్తున్నారు. లోపల ఎన్ని ఉన్నా ఒక్క పోస్ట్ పెడితే సరిపోయేదంటున్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం పవన్‌కి విషెస్‌ చెప్పడం విశేషం. 
 

56

బన్నీ..ఎందుకు విషెస్‌ చెప్పలేదనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమవుతుంది. అదే సమయంలో ఫోన్‌లో విష్‌ చేసి ఉండొచ్చని, ఇంటికి ఏదైనా గ్రీటింగ్‌ పంపించి ఉండొచ్చని అంటున్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలోనూ బన్నీ పాల్గొన్నారు. ఇవన్నీ పాజిటివ్‌ అంశాలు. కానీ వాటిని ఇప్పటి పరిస్థితులు డామినేట్‌ చేయడంతో `మెగా విభేదాలు` అనే పుకార్లు ఊపందుకున్నాయి. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్‌ పడుతుందో చూడాలి. లేదా నిజంగానే ఆ విభేదాలు ఉన్నాయా? అనేది మున్ముందు తెలుస్తుంది. 
 

66

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప 2` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప`కి కంటిన్యూగా రూపొందుతున్న చిత్రమిది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇందులో ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ,సునీల్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయిపల్లవి కూడా కనిపించబోతున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియాని మించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు సుకుమార్. పుష్పరాజ్‌ పాత్రతో ఈ సారి ఇండియా మొత్తాన్ని షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు బన్నీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories