విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్తల మధ్య అందరి దృష్టినీ ఆకర్షించారు విజయ్ తల్లి మాధవి దేవరకొండ. పెళ్లి వేడుకల్లో ఆమె చూపిన ఆప్యాయత, ప్రేమతో అందరి మనసులూ గెలుచుకున్నారు. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ, తన కొడుకు, రష్మిక మందన్న పెళ్లి వార్తలతో ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆమె కేవలం ఒక సెలబ్రిటీ తల్లి మాత్రమే కాదు, హైదరాబాద్‌లో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్ కూడా. యువతలో కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఆమె సొంతంగా ఓ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నారు. దీంతో సినీ పరిశ్రమకు బయట కూడా ఆమె ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
24
విజయ్ ఆత్మవిశ్వాసం వెనుక తల్లి పాత్ర
చిన్నప్పటి నుంచి విజయ్ దేవరకొండ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో మాధవి కీలక పాత్ర పోషించారు. ఒక ట్రైనర్‌గా ఆమె ఇచ్చిన శిక్షణ, మార్గదర్శకత్వం వల్లే విజయ్ స్పష్టంగా మాట్లాడటం, భావాలను వ్యక్తపరచడం అలవడింది. ఆ లక్షణాలే ఇప్పుడు తెరపైనా, బయట కూడా కనిపిస్తాయి. తరచూ విజయ్ ఈవెంట్స్‌కు హాజరవుతూ ఆమె సపోర్ట్ తెలుపుతారు. ఈ సూపర్‌స్టార్ విజయం వెనుక ఉన్న ప్రేమ, ప్రోత్సాహం వారి బంధంలో స్పష్టంగా కనిపిస్తుంది.
34
పెళ్లిలో భావోద్వేగ క్షణాలు..
ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్ సంగీత్ వేడుకలో మాధవి, రష్మిక మందన్న పట్ల చూపిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంది. వైరల్ అయిన ఒక వీడియోలో ఆమె రష్మికను 'నా డార్లింగ్ రుషి' అని పిలిచారు. అంతేకాదు, ప్రేమకు, కుటుంబ వారసత్వానికి గుర్తుగా కొన్ని వారసత్వపు నగలు, గాజులను బహుమతిగా ఇచ్చారు. ఆమె ఆప్యాయతకు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె కేవలం విజయ్ తల్లిగానే కాకుండా.. అభిమానులకు కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు.
పెళ్లి తర్వాత విజయ్ సొంత గ్రామంలో పూర్వీకులను స్మరించుకుంటూ చేసిన పూజల్లో కూడా మాధవి పాల్గొన్నారు. అక్కడ ఆమె బాధ్యతగా చేసిన పనులు, ఆప్యాయత, అందరిని ఆకర్శించింది. బలమైన కుటుంబ విలువలకు ఆమె ప్రతీకగా నిలిచింది. పెళ్లి వేడుకకు ఇంతటి ఎమోషనల్ టచ్ ఇచ్చినందుకు అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె కేవలం ఒక సెలబ్రిటీ తల్లి కంటే ఎక్కువేనని ఇది నిరూపిస్తోంది.