బాహుబలి సినిమాలో శివగామి చేతిలోని చిన్నారి ఎవరో తెలుసా?

Published : Sep 28, 2025, 02:33 PM IST

బాహుబలి సినిమాలో శివగామి నీటిపై ఎత్తి పట్టుకున్న చిన్నారి మహేంద్ర బాహుబలి దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. చాలామంది ఇది గ్రాఫిక్స్ అనుకున్నారు, కానీ ఆ పాత్రను పోషించింది కేవలం 18 రోజుల ఆడపిల్ల. ఇంతకీ ఎవరా పాప. 

PREV
110
శివగామి చేతిలోని చిన్నారి

బాహుబలి సినిమాలో నీటిలో చిన్నారి బాహుబలి ఉన్న దృశ్యాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఈ సీన్ లో రమ్యకృష్ణ నటన అద్భఉతంగా ఉంటుంది. రమ్యకృష్ణ పాత్ర కూడా అక్కడితో ముగుస్తుంది. కానీ ఈ ఒక్క సీన్  వెనుక ఉన్న అసలు నిజం ఏంటో  మీకు తెలుసా? ఇంతకీ ఆ బేబీ ఎవరు? నిజమా గ్రాఫిక్స్ మాయా? 

210
బాహుబలి ఒక అద్భుతం

ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  బాహుబలి ఒక అద్భుతం. సినిమాలోని గ్రాండియర్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. టాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ సినిమా పరువును నిలబెట్టిన మొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలి.  ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే, జనం దాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేరు.

310
శివగామి చేతుల్లో చిన్నారి బాహుబలి

బాహుబలి అనగానే శివగామి చేతుల్లో ఉన్న చిన్నారి మహేంద్ర బాహుబలి సీన్ గుర్తొస్తుంది. మనవడి ప్రాణం కాపాడటానికి శివగామి చేసిన ప్రయత్నం. రాజమాత మునిగిపోతున్నా, బాబును నీటిపైకి ఎత్తి పట్టుకున్న దృశ్యం సినిమాకే హైలెట్ గా నిలిచింది. అంత కాదు ఈ పోస్టర్ చాలా వైరల్ అయింది. సినిమాలో ఈ సీన్ చూసిన వారికి గూజ్ బామ్స్ వచ్చాయి. రమ్యకృష్ణ నటనకు అంతా ఫిదా అయ్యారు. 

410
గ్రాఫిక్స్‌లో సృష్టించారా?

ఈ సీన్ సినిమాలో ఒక కల్ట్ సీన్. చాలామంది ఈ బాబును గ్రాఫిక్స్‌లో సృష్టించారని అనుకున్నారు. వీఎఫ్ఎక్స్ మాయాజాలం అనుకున్నారు. కానీ, అవేవీ కాదు. ఈ సీన్ వెనుక ఉన్న అసలు కథ వింటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పోస్టర్ లో కనిపించిన చిన్నారి నిజమైన బేబీ. ఇంతకీ ఆ బేబీ ఎవరు? 

510
18 రోజుల ఆడపిల్ల

చిన్నారి మహేంద్ర బాహుబలి సీన్‌ను నిజమైన పాపతోనే చిత్రీకరించారు. కానీ, ఆ పాప అబ్బాయి కాదు. ఎంత వెతికినా మగ శిశువు దొరకకపోవడంతో, కేవలం 18 రోజుల ఆడపిల్లను ఈ సీన్‌లో తీసుకున్నారు. ఈ ఏజ్ లో ఉన్న పాపను షూటింగ్ కు ఇవ్వడం అంటే, అది అందరికి సాధ్యం అయ్యే పని కాదు. కానీ ఈ పాపను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఎవరు ఇచ్చారు? పాప పేరు ఏంటో తెలుసా? 

610
చిన్నారి బాహుబలి పేరు అక్షిత వల్సన్

ఆ పాప పేరు అక్షిత వల్సన్. అక్షిత తండ్రి వల్సన్ 'బాహుబలి' సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ సమయంలో, సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అక్కడే అక్షితను ఈ పాత్రకు ఎంపిక చేశారు. సమయానికి రాజమౌళి అనుకున్నట్టుగా బాబు దొరకలేదు. దాంతో ఈ పాపతో షూటింగ్ కంప్లీట్ చేశారు. అప్పుడు ఈ పాప తల్లీ తండ్రులు అనుకోని ఉండరు జాతీయ స్థాయిలో ఈ పోస్టర్, ఆ పాత్ర ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని. 

710
అక్షితపై ఎన్ని సీన్లు చేశారు?

దర్శకుడు రాజమౌళి ఈ సీన్ కోసం అబ్బాయిని అనుకున్నారు, కానీ కుదరలేదు. అందుకే అక్షితను ఎంచుకున్నారు. సినిమాలో అక్షితపై మొత్తం 5 షాట్లు చిత్రీకరించారు. సినిమాలో తమ కూతురికి ఎన్ని సీన్లు ఉన్నాయో, సినిమా విడుదలయ్యే వరకు అక్షిత తల్లిదండ్రులకు రాజమౌళి చెప్పలేదు.

810
రాజమౌళికి కూడా తెలియదు

అంతేకాదు, అక్షిత వల్సన్‌తో ఎన్ని సీన్లు తీయాలో దర్శకుడు రాజమౌళికి కూడా ముందుగా తెలియదట. అందుకే వారి తల్లీ తండ్రులక కూడా క్లారిటీ ఇవ్వలేదు. అందుకే షూటింగ్ అయిపోయేంత వరకూ  పాపతో వారు అక్కడే ఉన్నారు. ఈ పాపతో షూటింగ్ వాతావరణం అంతా సందడిగా మారిపోయింది. 

910
బాహుబలి సెట్ లో సందడి

చిన్నారి బాహుబలి పేరు అక్షిత వల్సన్ తో షూటింగ్ సెట్ అంతా సందడిగా మారింది. ఆ పాపను అందరు స్టార్లు ఎంతో ముద్దు చేశారు. ముఖ్యంగా ప్రభాస్ కూడా సెట్ లో ఆ  పాపను ఎత్తుకుని తిరిగే వారు. రమ్యకృష్ణ, సత్యరాజ్ కూడా అక్షితను ఎంతో ముద్దు చేశారు. ఇక రాజమౌళి భార్య రమ కూడా అక్షితతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవారు. ఇలా అక్షిత పుట్టిన 18 రోజులకే స్టార్ గా మారింది. 

1010
శివగామితోనే ఎక్కువ సీన్లు

ఇక అక్షిత బాహుబలి సినిమాలో ఎన్ని సన్నివేశాలలో కనిపిస్తుందా అని వారి తల్లీ తండ్రులు చాలా ఈగర్ గా వెయిట్ చేశారు.  సినిమా విడుదలయ్యాక, అక్షిత తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. అక్షిత ఒకటి రెండు కాదు, చాలా సీన్లలో కనిపించింది. ఆమె సీన్లు ఎక్కువగా శివగామితోనే ఉన్నాయి. దాంతో వారు ఎంతో సంతోషించారు. అంటే కాదు అతి చిన్న వయస్సులో స్టార్ గా మారిన బేబీ అక్షిత మాత్రమే. 

Read more Photos on
click me!

Recommended Stories