కుర్రాళ్ళే కంఫర్ట్ అంటున్న మీరాజాస్మిన్, ముసలి హీరోలు వదంటూ సంచలన వ్యాఖ్యలు..? తలపొగరంటున్న నెటిజన్లు..?

First Published | Nov 13, 2022, 5:01 PM IST

ఒక్కప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన హీరోయిన్ మీరా జాస్మిన్. చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలతో జతకట్టిన మలయాళ సోయగం.. రీసెంట్ గా సీనియర్ హీరోలపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఆమన్నదంటే..?
 

Meera Jasmine

టాలీవుడ్ ను శాసించిన మలయాళ బ్యూటీస్ లో మీరా జాస్మిన్ ది స్పెషల్ ప్లేస్. మాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు తెలుగు తెరపై సందడి చేశారు. అందులో మీరా జాస్మిన్ తన మార్క్ చూపించుకుంది. తరువాత తరువాత తెరమరుగు అయ్యింది బ్యూటీ.  

పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైపోయింది  మీరాజాస్మిన్ కాని సోషల్ మీడియాలోమాత్రం ఫుల్  యాక్టీవ్ గా ఉంది. ఎప్పటికప్పుడు తన అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటూనే.. తనను జనాలు మర్చిపోకుండా చూసుకుంటుంది మీరా. అంతే కాదు కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. హాట్ హాట్ అందాలతో  ఇన్ స్టాను నింపేస్తూ ఉంది. 


ఇక సెకండ్ ఇన్నింగ్స్ కోసం  గట్టిగా ట్రై చేస్తోంది మీరా జాస్మిన్. ఆ ప్రయత్నంలోనే మీరా జాస్మిన్ కు విక్టరీ స్టార్ వెంకటేష్ తో నటించే అవకాశం వచ్చిందట. నారప్ప సినిమాలో హీరోయిన్ మీరాను తీసుకోవాలి అనుకున్నారట. అవకాశం వచ్చిందట . అయితే మీరాజాస్మిన్ .. వెంకటేష్ తో నటించను అని ఓపెన్ గా చెప్పేసిందట. 

ఆయన ఒకప్పుడు హీరో ఇప్పుడు కాదు ముసలోడు అయిపోయారు కదా అంటూ డైరెక్టర్ ముందే చెప్పుకొచ్చిందట .దీంతో ఆ మాటలు వైరల్ గా మారిన్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఆమె నటసింహం బాలయ్య బాబు సినిమాలో కూడా అవకాశం వస్తే రిజక్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

దీంతో వెంకటేష్ లాంటి పెద్ద హీరోని అంత మాట అన్నదా.. ఎంత తలపొగరు ఆ హీరోయిన్ కు అంటూ నెటిజన్లు మండిపడుతున్నట్టు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఆ సినిమాను ప్రియమణి హీరోయిన్ గా నటించింది . ఇక ఈసినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..? 

Meera Jasmine

అంతేకాదు ఆ తర్వాత కూడా నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కోసం గోపీచంద్ మల్లినేని ఆమెను అప్రోచ్ అవ్వగా..అది కూడా రిజెక్ట్ చేసిందట. మంచి మంచి ఆఫర్లను పొగొటటుకుంటున్న మీరా జాస్మీన్ కుర్ర హీరోల సరసన ఛాన్స్ కావాలంటుందట. కుర్ర హీరోలు నీలాంటి సీనియర్ ను ఎందుకు తీసుకుంటారన్నా వినడంలేదుట మీరా జాస్మిన్. 

Meera Jasmine

అంతే కాదు అది వర్కౌట్ అవ్వకపోయినా.. మంచి గ్లామర్ రోల్స్ తో రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే  అటు నెట్టింట్లో కూడా హాట్ ఫోటో షూట్  తో అదరగొడుతూ... కుర్రాళ్ళలో హీట్ పెంచేస్తోంది బ్యూటీ. ఇక  ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. 

Latest Videos

click me!