తన కూతురు నైనిక సినీరంగ ప్రవేశం గురించి కూడా మీనా మాట్లాడారు. 'దీని గురించి నాకు సంతోషంగా ఉంది. విజయ్ నటించిన `తెరి` సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇది నాకు చాలా గర్వకారణం' అని మీనా అన్నారు.
తన సినీ ప్రయాణం గురించి కూడా మాట్లాడిన ఆమె, `పడయప్ప`(నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ నటించిన విలన్ పాత్రలో మొదట నన్ను ఎంపిక చేశారు. కానీ, ఆ పాత్రలో నటించవద్దని నా అమ్మ చెప్పేసింది. అందుకే నేను నటించలేదు.
కథానాయికగా నటిస్తున్నప్పుడు, విలన్ గా నటిస్తే, అది నా సినీ ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుందని అమ్మ భావించారు. కానీ, తర్వాత ఆ పాత్రలో నటించి ఉండవచ్చేమో అని నాకూ అనిపించింది` అని మీనా అన్నారు. ఇప్పుడు మీనా చెప్పిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.