Meena : రెండో పెళ్లిపై మీనా సంచలన కామెంట్స్, ధనుష్ తో వచ్చిన వార్తలపై క్లారిటీ..

Published : Feb 21, 2026, 01:07 PM IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ.. గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ ను మీనా పెళ్లాడబోతుందంటూ న్యూస్ ఒకటి వచ్చింది. ఈ విషయంలో మీనా క్లారిటీ ఇచ్చింది.

PREV
15
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన మీనా ..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది మీనా . తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలతో ఊపు ఊపేసింది. దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన మీనా .. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జు, వెంకటేష్, సుమన్, జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక తమిళంతో రజినీకాంత్, విజయ్ కాంత్, కమల్, శరత్ కుమార్ ల జంటగా మెరిసింది. ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది మీన. తల్లి పాత్రలు చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించడంలేదు.

25
చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మీనా..

ఫిల్మ్ కెరీర్ విషయంలో ఎన్నో సక్సెస్ లు చూసిన మీనా.. పర్సనల్ లైఫ్ లో భారీ విషాదాన్ని ఫేస్ చేసింది. ఆమె భర్త విద్యాసాగర్ 2022 సంవత్సరంలో కరోనా కారణంగా మరణించారు. అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై అనేక వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. 

గత కొంతకాలంగా ఆమెపై సోషల్ మీడియాలో వస్తున్న రెండో పెళ్లి రూమర్స్ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తమిళ హీరో ధనుష్‌ను మీనా పెళ్లాడబోతున్నారనే వార్తలు అప్పట్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఆ సమయంలోనే మీనా ఆ వార్తలపై స్పందించారు.

35
రెండో పెళ్లిపై మీనా కామెంట్స్..

తెలుగులో ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ రూమర్స్‌పై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో తన రెండో పెళ్లిపై వచ్చిన వార్తలు చూసి షాక్ అయ్యానన్నారు. మీనా మాట్లాడుతూ.. ఇలాంటివి ఎలా వస్తున్నాయో అర్ధం కావడంలేదు.. నేను మీడియాను బాగా రెస్పెక్ట్ చేస్తాను. కానీ ఇలాంటివి ఎలా రాయగలుగుతున్నారు. 

అసలు ఎవరు చెప్పారు వీళ్లకు.. నాకు నవ్వొస్తుంది ఇవి చూస్తే.. ఇండస్ట్రీలో ఎవరు డివోర్స్ అయినా.. సింగిల్ గా ఉన్నవారికి కలిపి.. పెళ్లి అని రాసేస్తున్నారు. అసలు నేను షాక్ అయ్యాను.. ధనుష్ తో నాకు పెళ్లి అని కూడా రాశారు.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. చాలామందితో కలిపి ఇలానే ప్రచారం చేస్తున్నారు.'' అని మీనా అన్నారు.

45
ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తున్న మీనా ..

సాధ్యమైనంత వరకు ఇలాంటి రూమర్స్ ను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నానని, అయితే అయినవాళ్లు మాత్రం ఇవి చూసి.. ప్రశ్నించినప్పుడు బాధనిపిస్తుంది అన్నారు మీన. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే, మలయాళంలో మోహన్ లాల్‌తో కలిసి ‘దృశ్యం 3’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

55
తెలుగులో మీన సినిమాలు..

తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ కానుంది. త్వరలోనే విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఆమె సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. అదనంగా ‘రౌడీ బేబీ’ అనే తమిళ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మలయాళంలో తెరకెక్కుతున్న ‘సీక్రెట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. ఈ సిరీస్ జియో హాట్ స్టార్ యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories