విష్వక్‌ ఈ రచ్చ ఏంటి, ఏది నిజం ..ఏది అబద్దం? మరో వివాదమా

First Published Jun 13, 2024, 9:28 AM IST

ఈ జనరేషన్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత స్పీడుగా మినిమమ్ గ్యారెంటీ ముద్ర వేసుకున్న హీరో విశ్వక్సేన్ ఒక్కడే అనేది అతిశయోక్తి కాదు. 


మొదటి నుంచి విశ్వక్సేన్ ది ఓ విభిన్నమైనదారి. తన సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్శిలతోనే పాపులర్ అయ్యాడు. మంచి నటుడైన విశ్వక్సేన్ తన సినిమాల ప్రమోషన్ కోసం వివాదాలను కోరి ఆహ్వానిస్తూంటారు. అతనికు మెల్లిమెల్లిగా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. మీడియం రేంజి హీరో నుంచి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లే ప్రాసెస్ లో ఉన్నాడు. ఈ రోజు విశ్వక్సేన్ సినిమా అంటే మంచి ఓపినింగ్స్ కూడా వస్తున్నాయి. మాస్ కా దాస్ అనే పేరుని నిజం చేసుకున్నాడు. తాజాగా మరో వివాదానికి ట్వీట్ తో అంకురార్పణ చేయటం మొదలెట్టాడు. 
 


 తను ఎంచుకునే కథలు, సినిమాలతో  మంచి మాస్ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు  విశ్వక్. అందుకే విశ్వక్‌ను మాస్ కా దాస్ అంటుంటారు. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘దాస్​ కా ధమ్కీ’, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి  లాంటి సినిమాలతో ఈయన మార్కెట్ కూడా బాగానే పెరిగిపోయింది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ జనరేషన్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత స్పీడుగా మినిమమ్ గ్యారెంటీ ముద్ర వేసుకున్న హీరో విశ్వక్సేన్ ఒక్కడే అనేది అతిశయోక్తి కాదు. 

Latest Videos



ఇక విశ్వ క్సేన్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటి అంటే కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చూపించటం. ఫలక్‌నుమాస్ దాస్, ధమ్కీ లాంటి సినిమాలు ఈయనకు డైరెక్టర్‌గానూ గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అవ్వడం ఈ హీరో స్టైల్ గా మారింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందేమో అనిపిస్తుందితాజాగా ఆయన వేసిన ట్వీట్  చూస్తుంటే. తన సినిమా బిజినెస్ గురించి  అసలు రచ్చ మొదలైంది.  
 


 తాజాగా విశ్వక్సేన్ మొదలెట్టిన వివాదం విషయంలోకి వెళితే...  విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెకానిక్‌ రాకీ’ (mechanic rocky). ఈ సినిమా పంపిణీ హక్కుల గురించి ఒకరు ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టగా విష్వక్‌ స్పందించారు. “డాంకీ ఎగ్ (గాడిద గుడ్డు) ఏం కాదు. జీఎస్టీతో అంట. టీ షాప్ ముచ్చట్లు తీసుకొచ్చి ట్విట్టర్‌లో పెడుతున్నారు. మెకానిక్ రాకీని ఇంకా అమ్మలేదు. నిజాలను సరిగ్గా చెప్పండి. ఇది టీమ్ కెరీర్” అని విశ్వక్ కామెంట్ ట్వీట్ చేశారు.


వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ (ఆలిండియా)ను సొంతం చేసుకున్నట్టు ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా  ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు కలిపి రూ. 8 కోట్లకు ఈ సినిమా పంపిణీ హక్కులను ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కొనుగోలు చేసిందంటూ సదరు వ్యక్తి ట్వీట్‌ చేయగా విష్వక్‌ రియాక్ట్‌ అయ్యారు. 


హక్కులు పొందామని ఆ సంస్థ ప్రకటించినప్పటికీ విష్వక్‌ విక్రయించలేదనడంతో ఆయన అభిమానులు, సినీ అభిమానుల్లో  సందిగ్ధత నెలకొంది. అసలు అమ్మారా లేదా ..సంస్ద వాళ్లు మేము కొనుక్కున్నాము అంటూంటే ఇంకా రైట్స్ అమ్మలేదని విశ్వక్సేన్ అనటం ఏమిటనేది ఎవరికీ అర్దం కాలేదు. అయితే ఇది వివాదం అయ్యి సినిమా గురించి జనం మాట్లాడుకోవాలనే విశ్వక్సేన్ ఆలోచన అంటున్నారు. ‘ఇదో కొత్తరకం ప్రచారం’ అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 


రైట్స్  విషయం విశ్వక్‍సేన్‍కు నిజంగా తెలియదా.. లేకపోతే మెకానిక్ రాకీ మూవీకి బజ్ కోసం ఇలా చెప్పారా అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశం అలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. మెకానిక్ రాకీ చిత్రానికి తేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‍సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బెజోయ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. విష్వక్‌కు ఇది 10వ చిత్రం.  
 


మరో ప్రక్క విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ మూవీ జూన్ 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మే 31న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా 15 రోజులు గడవకుండానే ఓటీటీలో అడుగుపెడుతోంది. మంచి బజ్‍తో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఈ రూరల్ మాస్ యాక్షన్ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్‍గా నటించగా.. అంజలి కీలకపాత్ర చేశారు. జూన్ 14 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని చూడొచ్చు.
 

click me!