అల్లు అర్జున్ ఇక ఒంటరే! పుష్ప రాజ్ పై కత్తి కట్టిన మెగా హీరోలు, గెలుపు ఎవరిది?

First Published Jun 13, 2024, 7:27 AM IST

అల్లు అర్జున్ తో మెగా హీరోల కోల్డ్ పతాక స్థాయికి చేరిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇకపై అల్లు అర్జున్ కి ఏ విధంగా సపోర్ట్ చేయడకూడదని కొణిదెల ఫ్యామిలీ ఫిక్స్ అయ్యారేమో అనిపిస్తుంది. ఈ అంతర్గత యుద్ధం ఎటు దారి తీస్తుందో అనే వాదనలు మొదలయ్యాయి. 
 

Allu Arjun


అల్లు-కొణిదెల కుటుంబాల మధ్య దూరం పెరిగింది. కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన కొన్నాళ్లుగా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా హీరో బ్రాండ్ నుండి బయటకు రావాలని చూస్తున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లను చిరంజీవి, అల్లు అరవింద్ ఒకటి రెండు సందర్భాల్లో ఖండించారు. 
 

Allu Arjun

అల్లు అర్జున్-రామ్ చరణ్ అయితే అంటీముట్టనట్లు ఉంటున్నారు. గత రెండు మూడేళ్ళలో వారు ఆప్యాయంగా మాట్లాడుకుంది లేదు. ఇద్దరూ స్టార్డమ్ లో పోటీ పడుతున్నారు. అల్లు-కొణిదెల కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయనే పుకార్లకు చెక్ పెడుతూ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలు బెంగుళూరులో కలిసి జరుపుకున్నారు.

అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం చిచ్చురేపింది. ఒక పక్క జనసేన గెలుపు కోసం మెగా హీరోలందరూ అహర్నిశలు కష్టపడుతుంటే ఎన్నికల ప్రచారం చివరి రోజు నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవి రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించాడు. ఇది మెగా హీరోలకు నచ్చలేదు. 
 

Allu Arjun


నాగబాబు అయితే పరోక్షంగా తన అసహనం బయటపెట్టాడు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా బయటవాడే అని ట్వీట్ చేశాడు. నాగబాబు కామెంట్ దుమారం రేపింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్  ట్రోల్ చేయడంతో ఆయన సదరు ట్వీట్ డిలీట్ చేసినట్లు వివరణ ఇచ్చాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. 

Allu Arjun


ఈ పరిణామాలు గమనిస్తుంటే అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్, వరుణ్ ఆగ్రహంతో ఉన్నారని అర్థం అవుతుంది. అతన్ని ఒంటరిని చేయాలని డిసైడ్ అయ్యారని అర్థం అవుతుంది. 
 

Allu Arjun

నిజానికి అల్లు అర్జున్ కోరుకుంటుంది అదే. అల్లు అర్జున్ ని మెగా హీరోలు ఏ విధంగా హర్ట్ చేశారో తెలియదు కానీ... కొన్నేళ్లుగా ఆయన తన సొంత అభిమాన గణాన్ని పెంచుకునే పనిలో ఉన్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ బ్రాండ్ నేమ్ క్రియేట్ చేశాడు. చిరంజీవి మద్దతుతో ఎదిగాడనే గుర్తింపు పోగొట్టుకోవాలని అనుకుంటున్నాడు.

Allu Arjun

అంతవరకు వస్తే చిరంజీవి ఎదుగుదలకు తన తాత అల్లు రామలింగయ్య కారణం. కాబట్టి నేను చిరంజీవికి కృతజ్ఞుడిగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అనుకుంటున్నారు. అదే సమయంలో మెగా ఫ్యామిలీ తనను ఒంటరి చేసినా, సహాయ నిరాకరణకు పాల్పడ్డా... వచ్చిన నష్టం ఏమీ లేదనేది అతడి ఆలోచన.

అల్లు అర్జున్ ఇమేజ్ ఇప్పుడు బౌండరీలు దాటేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప మూవీతో నార్త్ లో కూడా జెండా పాతాడు. పుష్ప 2 విడుదలకు ముందే రూ. 1000 కోట్ల బిజినెస్ చేసింది. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా ఉన్నంత క్రేజ్ మెగా హీరోల్లో మరో హీరోకి లేదు. సో.. అల్లు అర్జున్ యుద్దానికి సిద్ధం అంటున్నాడు...

Latest Videos

click me!