హీరోయిన్ కి 7 నెలల ప్రెగ్నన్సీ.. కానీ గర్భం కనిపించలేదట, నమిత సంచలన వ్యాఖ్యలు

First Published Jun 12, 2024, 10:03 PM IST

హాట్ బ్యూటీ నమిత గురించి పరిచయం అవసరం లేదు. తమిళనాడులో ఆమె కోసం ఏకంగా గుడి కట్టేసి ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో నమిత జెమిని, సొంతం, బిల్లా, సింహా చిత్రాల్లో నటించింది.

హాట్ బ్యూటీ నమిత గురించి పరిచయం అవసరం లేదు. తమిళనాడులో ఆమె కోసం ఏకంగా గుడి కట్టేసి ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో నమిత జెమిని, సొంతం, బిల్లా, సింహా చిత్రాల్లో నటించింది. తాను బొద్దుగా ఉంటేనే తన ఫ్యాన్స్ కి ఇష్టం అని.. అందుకే సన్నాబడాలని అనుకోవడం లేదని గతంలో నమిత తెలిపింది. 

2017లో నమిత వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అంతకు ముందు నమిత పర్సనల్ లైఫ్ పై కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని నమిత పట్టించుకోలేదు. ప్రస్తుతం నమిత తన భర్త పిల్లలతో అన్యోన్యంగా జీవిస్తోంది. రాజకీయాల్లో సైతం రాణిస్తోంది. 

రీసెంట్ గా ఇంటర్వ్యూలో నమిత పెళ్లి తర్వాత ప్రెగ్నన్సీ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులని వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2021లో నమిత తొలిసారి గర్భవతి అయిందట. ఇంట్లో అందరికి చెప్పాను. మా నాన్నకి నువ్వు తాతయ్య కాబోతున్నావు అని చెప్పాను. అంతా చాలా సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు. 

నాలుగు నెలలకే అబార్షన్ అయింది. దీనితో డిప్రెషన్ లోకి వెళ్ళాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ గర్భవతి అయ్యాను. మూడు నెలలకే నాకు ట్విన్స్ పుట్టబోతున్నారని తెలిసింది. దీనితో నా భర్త బాగా గారాబం చేశారు. బెడ్ పై నుంచి దిగనివ్వలేదు. ఎక్కువగా నడవకూడదు.. మెట్లు ఎక్కకూడదు అని కండిషన్స్ పెట్టారు. 

namita

నేను గర్భవతిని అని కంఫర్మ్ అయినప్పటికీ.. బయటకి 7 నెలల వరకు గర్భం కనిపించలేదు. పొట్ట పెరగలేదు. దీనితో చాలా టెన్షన్ పడ్డాను. 7 నెలల తర్వాత గర్భం కనిపిస్తూ వచ్చింది. బహుశా తాను బొద్దుగా అనడం వల్ల అలా అనిపించి ఉండొచ్చని నమిత పేర్కొంది. 

నమిత ఆ తర్వాత ట్విన్స్ కి జన్మనిచ్చింది. ఆమెకి పండంటి మగపిల్లలు జన్మించారు. ప్రస్తుతం నమిత బిజెపి నాయకురాలిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె సినిమాలని పక్కన పెట్టేశారు. 

Latest Videos

click me!