Rajamouli-Mayookha: రాజమౌళి అమ్మాయిని దత్తత తీసుకోవడానికి, మయూఖ మూవీకి ఉన్న సంబంధమేంటో తెలుసా?

Published : Oct 07, 2026, 05:41 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు పాయల్‌ చెంగప్ప నటించిన `మయూఖ` సినిమాకి ఒక సంబంధం ఉంది. అదేంటనేది దర్శకుడు రివీల్‌ చేశారు.

PREV
14
ఈ నెల 9న రిలీజ్‌ కాబోతున్న మయూఖ

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా `మయూఖ`.ఈ చిత్రాన్ని శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల శ్రీతేజ్ ఎస్.కె. గా స్క్రీన్ నేమ్ మార్చుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా ఈ నెల 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను, ఈ మూవీకి, రాజమౌళి దత్తత తీసుకున్న అమ్మాయికి ఉన్న సంబంధం గురించి దర్శకుడు వెల్లడించారు.

24
మయూఖ టైటిల్‌కి రాజమౌళి కూతురికి ఉన్న సంబంధం

దర్శకుడు శ్రీతేజ్‌ ఎస్‌కే మాట్లాడుతూ, `మయూఖ` అంటే ఆశాకిరణం. సినిమా చూస్తూ చివరకు వచ్చేసరికి టైటిల్ జస్టిఫై అవుతుంది. నేను రూపొందించిన చివరి షార్ట్ ఫిలిం పేరు మయూఖ. ఆ షార్ట్ ఫిలిం కంప్లీట్ చేయకుండానే యూఎస్ వెళ్లాను. అప్పుడు రాజమౌళి గారు ఒక పాపను దత్తత తీసుకుని ఆమెకు మయూఖ అనే పేరు పెట్టారు. అప్పుడే నా మూవీకి ఈ టైటిల్‌ అనుకున్నారు. నా ప్రొఫెషనల్ కెరీర్ లో కొనసాగుతున్న టైమ్ లో ప్రొడ్యూసర్ కు ఈ మయూఖ కథ చెబితే బాగుంది చేద్దామని అన్నారు. ఈ సినిమాకు విజువల్, సౌండ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. క్వాలిటీగా చేశాం. శిబి మాత్యూ అలెక్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా `మయూఖ` సినిమాకు ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మిస్టరీ మూవీగా అవార్డ్ వచ్చింది. థ్రిల్లర్ కేటగిరిలో సెకండ్ బెస్ట్ వచ్చింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు కూడా మా మూవీని అప్లై చేశాం. మీరు మా మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే కొరియన్, హాలీవుడ్ మూవీ తరహా స్టోరీ టెల్లింగ్, కలర్ గ్రేడింగ్ కనిపిస్తుంటుంది. స్టోరి కొద్ది కొద్దిగా రివీల్ అవుతూ సెకండాఫ్ వచ్చేసరికి పీక్స్ కు వెళ్తుంది. ఇటీవల మన ప్రేక్షకులు ఓటీటీల్లో థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు, సినిమాలు బాగా చూస్తూ వస్తున్నారు. సో వాళ్లకు నచ్చేలా మన కంటెంట్ ఉండాలంటే కొత్తగా, క్వాలిటీగా ప్రయత్నించాలి. మయూఖ చిత్రానికి మేము అలాంటి ప్రయత్నమే చేశాం.

34
మొదట మహేశ్వరి అనుకున్నాం

ఈ కథను మొదట నటి మహేశ్వరి (గులాబీ ఫేమ్) కి చెప్పాం. ఆమె మేము చెప్పిన రెండు కథలు విన్నారు. ఈ స్టోరీతో పాటు మరొక కథ ఆమెకు బాగా నచ్చింది. ఆ కథకు ఆమె లాక్ అయ్యారు. పాయల్ కన్నడలో మంచి ఎంటర్ టైనింగ్ మూవీస్ చేశారు. ఆమె మా కథలోని క్యారెక్టర్ కు బాగా సరిపోతారని అనిపించింది. ఆమె చేసిన వెబ్ సిరీస్ లతో ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ కు రీచ్ అయ్యారు. ఈ కథలో ఆమె పాత్రను మన ఆడియెన్స్ బాగా రిలేట్ చేసుకుంటారు, ఆమె క్యారెక్టర్ పడే స్ట్రగుల్స్ కు రెస్పాండ్ అవుతారని నమ్మాం. మయూఖగా పాయల్ చెంగప్ప అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కుతుంది.

44
సరికొత్త థ్రిల్లర్‌గా మయూఖ

ఇలాంటి తరహా థ్రిల్లర్స్ గతంలో వచ్చినా మా మూవీలో స్క్రీన్ ప్లే, సినిమా స్టోరీని ప్రెజెంట్ చేసే విధానం కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది. ప్రెజెంటేషన్ కొత్తగా ఉంది కాబట్టే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ థ్రిల్లర్ గా అవార్డ్ దక్కింది. ఇక్కడే మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే నమ్మకం మొదలైంది. ఎక్కడో స్మశానంలో దెయ్యాలు ఉన్నాయంటే ముందే మనసు ప్రిపేర్ అవుతుంది కానీ మనం నివసించే చోట, రోజు ఉండే చోట ఎవరో అపరిచిత వ్యక్తి ఉన్నారంటే ఇంకా ఎక్కువ భయపడతాం. మయూఖ హారర్ సినిమా కాదు థ్రిల్లర్ మూవీ. హీరోయిన్ ఉండే ఫ్లాట్ లోకి ఒక అపరిచిత వ్యక్తి ఎందుకు వచ్చాడు, అతను ఏం చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ తో అతనికి రిలేషన్ ఏంటి ..ఇలాంటి అంశాలతో కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంటుంది. మా సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది. మన ఆడియెన్స్ కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్ చూసి మన వాళ్లు ఇలా ఎందుకు తీయరు అనుకుంటూ ఉంటారు. మనం అలాంటి ప్రాడక్ట్ ఇస్తే తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. మా సినిమాలో ఎమోషన్ కంటే ఎక్కువగా ఎక్స్ పీరియెన్స్ ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. సినిమా మేకింగ్ లో మా ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల నుంచి కంప్లీట్ సపోర్ట్ లభించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories