ఆ హీరోయిన్ ఎవరు అంటూ జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు, మయసభలో ఆయన లవ్ స్టోరీ నిజమేనా ?

Published : Aug 08, 2025, 09:40 AM IST

ఇటీవల విడుదలైన మయసభ వెబ్ సిరీస్ లో ఓ పొలిటీషియన్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ తో ఆయన లవ్ స్టోరీ నిజామా ? కల్పితమా ? అంటూ నెటిజన్ల మధ్య డిస్కషన్ జరుగుతోంది. 

PREV
15
మయసభ వెబ్ సిరీస్ కి సూపర్ రెస్పాన్స్ 

విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దేవకట్టా. ప్రస్థానం, ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్ లాంటి చిత్రాలని దేవకట్టా తెరకెక్కించారు. ఆయన రూపొందించే చిత్రాలకు ప్రశంసలు దక్కుతాయి కానీ కమర్షియల్ సక్సెస్ రావడం లేదు. తాజాగా దేవకట్టా రూటు మార్చారు. ఈసారి వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. మయసభ అనే వెబ్ సిరీస్ దేవకట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. ఇది ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగష్టు 7న విడుదలైన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

DID YOU KNOW ?
SSMB 29 చిత్రానికి రచయితగా దేవకట్టా
డైరెక్టర్ దేవకట్టా ప్రస్తుతం మహేష్, రాజమౌళి SSMB 29 చిత్రానికి రచయితగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తాను ఇప్పుడే ఎలాంటి కామెంట్ చేయలేను అని దేవాకట్టా అన్నారు. 
25
రాజకీయ నాయకులుగా ఆది పినిశెట్టి, చైతన్య రావు 

 ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ దేవకట్టా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు లెజెండ్రీ పొలిటీషియన్ల స్నేహం ఆధారంగా రాసుకున్నారు. కానీ ఆ విషయాన్ని మాత్రం బయటకి చెప్పలేదు. అనవసరమైన కాంట్రవర్సీ వద్దనుకున్నారేమో. ఎందుకంటే ఈ సిరీస్ లో వారి పొలిటికల్ లైఫ్, ఫ్రెండ్ షిప్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో ఆది పినిశెట్టి 'కాకర్ల కృష్ణమనాయుడు(KKN)' గా, చైతన్య రావు 'ఎంఎస్ రామిరెడ్డి(MSR)' గా నటించారు. వీరిద్దరూ పోషించిన పాత్రలు ఇద్దరు రాజకీయ నాయకులని పోలి ఉంటాయి. 

35
సర్ప్రైజ్ చేసిన తాన్యా రవిచంద్రన్ 

మయసభలో దేవకట్టా చూపించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ పోషించిన పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఆమె పాత్ర పాత్ర ఆడియన్స్ కి బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. కాకర్ల కృష్ణమ నాయుడికి ప్రేయసిగా ఆమె నటించింది. ఈ వెబ్ సిరీస్ లో దేవకట్టా మొత్తం నిజాలే చూపించలేదని, కొంత ఫిక్షనల్ స్టోరీ కూడా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

45
ఆ హీరోయిన్ ఎవరు ?

ఈ నేపథ్యంలో కృష్ణమనాయుడు, తాన్యా రవిచంద్రన్ మధ్య జరిగిన లవ్ స్టోరీ నిజంగానే రియల్ లైఫ్ లో జరిగిందా లేదా అంటూ ఆడియన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఆమెతో కృష్ణమ నాయుడు లవ్ ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగినట్లు చూపించారు. రియల్ లైఫ్ లో ఆ హీరోయిన్ ఎవరు అనేదానిపై ఎవరికి వారు తమకి తోచినట్లుగా ఊహించుకుంటున్నారు. 

55
వైరల్ అవుతున్న ఇతర అంశాలు 

ఆ పాత్రలో తాన్యా రవిచంద్రన్ అద్భుతంగా నటించింది. గ్లామర్ కూడా ఒలకబోసింది. ఆమెతో ఎమోషనల్ సీన్స్ లో ఆది పినిశెట్టి అదరగొట్టారు. అదే విధంగా ఎంఎస్ రామిరెడ్డి తండ్రి పాత్ర కూడా ఆడియన్స్ కి సర్ప్రైజ్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయన అలాగే ఉండేవారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మూవీ స్టార్ ఆర్సీఆర్ గా సాయి కుమార్ నటించారు. ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఓ రాజకీయ నేత.. మీరంటే నాకు పిచ్చి అభిమానం.. నా కొడుక్కి మీ పేరే పెట్టుకున్నా అని చెప్పే సన్నివేశం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories