Ravi Teja : సినిమాలపై మాస్ మహారాజ రవితేజ సంచలన నిర్ణయం.! ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Published : Apr 14, 2022, 11:25 AM ISTUpdated : Apr 14, 2022, 11:26 AM IST

హీరో మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస సిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒక్కో ప్రాజెక్ట్ ను రాకెట్ వేగంతో పూర్తి చేస్తున్నారు. అయితే తన రాబోయే చిత్రాలపై రవితేజ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

PREV
16
Ravi Teja : సినిమాలపై మాస్ మహారాజ రవితేజ సంచలన  నిర్ణయం.! ఫ్యాన్స్ తట్టుకోగలరా?

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ (Ravi Teja) వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. గతేడాది నుంచి హిట్ చిత్రాలతో తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. దర్శకుడు గోపీచంద్ మాలినేని, రవిజేత కాంబినేషన్ లో వచ్చిన ‘క్రాక్’ సినిమా నుంచి మాస్ మహారాజ విభిన్న కథలను, కథాంశాలను ఎంచుకుంటున్నారు. 
 

26

అభిమానులు డిజపాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ పైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రవితేజ సినిమాలకు ఇండస్ట్రీలో ఎలాంటి ఢోకా లేదు. ఇకపైనా అలాంటి ప్రమాదమేమీ లేదనేది అర్థమవుతోంది.   

36

అయినప్పటికీ రవితేజ తన రాబోయే చిత్రాలపై సంచన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నాడట రవితేజ. కానీ ఆ సినిమాలో తన పాత్రకు తగిన ప్రధాన్యత ఉండాలని, తన అభిమానులకు కూడా నచ్చే విధంగా ఉండాలని చెబుతున్నట్టు తెలుస్తోంది. 

46

కథ నచ్చితే మల్టీస్టారర్ కూడా చేయాలనుకుంటున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం.  అయితే 1997కు ముందు ‘సింధూరం’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రవితేజ. అంతకు ముందు ఏడెనిమిది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేంది ప్రశ్నార్థకంగా మారింది. 
 

56

మరోపక్క రవితేజ వరుస పెట్టి ప్రాజెక్ట్‌లను చేస్తున్నాడు. ఇప్పటికే చేతిలో ఐదారు ప్రాజెక్ట్‌లున్నాయి. అలాగే ఇప్పటికే చిరంజీవి  (Chiranjeevi) బాబీ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య (Balakrishna), రవితేజ ప్రాజెక్ట్ కూడా త్వరలో అనౌన్స్ కాబోతోంది. బాలయ్య చిత్రంగా వస్తున్నట్టు తెలుస్తోందీ.. అందులో రవితేజ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం.  

66

ఇక ఇప్పటికే ‘రామరావు ఆన్ డ్యూటీ’ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు రవితేజ. ప్రస్తుతం ‘రావణసుర, ధమాఖ, టైగర్ నాగేశ్వర్ రావు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. శరత్ మండ దర్వకత్వంలో తెరకెక్కుతున్న Rama Rao On Duty జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories