Aishwarya Rajesh Pics : క్యూట్ స్మైల్ తో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటున్న ఐశ్వర్య రాజేశ్.. లేటెస్ట్ పిక్స్..

Published : Apr 14, 2022, 10:16 AM IST

 డస్కీ బ్యూటీ, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) నటనతోనే కాదు.. గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటోంది. తాజాగా లేటెస్ట్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిందీ బ్యూటీ. క్యూట్ గా నవ్వుతూ కుర్రాళ్లను తనవైపు తిప్పకుంటోంది.  

PREV
16
Aishwarya Rajesh Pics : క్యూట్ స్మైల్ తో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటున్న ఐశ్వర్య రాజేశ్.. లేటెస్ట్ పిక్స్..

తమిళ హీరోయిన్  ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh) ప్రస్తుతం తమిళ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. అందుకే సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అలా కనిపించి వెళిపోతోంది. మరోవైపు తన ఇన్ స్టా అకౌంట్ కూడా హ్యాక్ కావడంతో కాస్తా దూరమైంది.
 

26

ప్రస్తుతం మళ్లీ ఇన్ స్టాలో సందడి చేస్తోంది ఐశ్వర్య రాజేశ్. తాజాగా తను అందుకున్న అవార్డుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుందీ బ్యూటీ.  అదేవింధం లేటెస్ట్ అవుట్ ఫిట్ లో ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను కూడా షేర్ చేసుకుంది.   
 

36

ఇటీవల చైన్నైలో ‘దివా ఆప్ ద డికెడ్ అవార్డ్స్ 2022’ (Dod Awards 2022) ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు. రెండు రోజుల కింద చెన్నైలోని ఎమ్మార్సీ నగర్ లో గల ద లీలా ప్యాలెస్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విమెన్ అచీవర్స్ కు అవార్డులు ప్రదానం చేశారు. 
 

46

ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ కూడా అవార్డు అందుకుంది. అయితే ఈ అవార్డును ఐశ్వర్య రాజేశ్ తన తల్లి నాగమణి మరియు సోదరుడు మణికంట రాజేష్ చేతుల మీదుగా అందుకుంది. ఇందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. దివా ఆఫ్ ది డెకేడ్ అవార్డును అందించి గుర్తుండిపోయేలా చేసినందుకు ధన్యవాదాలు dodawards2022కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. 
 

56

ఐశ్వర్య అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో  లెంన్తీ గౌన్ లో ఆకర్షణీయంగా ఉంది. తన ఫిట్ నెస్ కు తగ్గుట్గుగా, నేటివిటీకి దగ్గరగా ఉండేలా అవుట్ ఫిట్ ను ధరించింది. కార్యక్రమం అనంతరం క్యూట్ గా నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

66

ఐశ్వర్య రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలే కాకుండా  లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా  చేస్తోంది ఐశ్వర్య. `మిస్‌మ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను  అలరించింది. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలు చేస్తుంది. `ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌,  `డ్రైవర్‌ జమునా`, `మోహన్‌దాస్‌`, మలయాళంలో `పులిమడ`  వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

click me!

Recommended Stories