Niharika- Nagababu: ఆంక్షల మధ్య దుర్భరంగా నిహారిక లైఫ్?... ఫ్రీడమ్ మిస్ యూజ్ చేసిన ఫలితమేనా?

Published : Apr 14, 2022, 10:25 AM ISTUpdated : Apr 14, 2022, 10:27 AM IST

వరుస సంఘటనలు నిహారిక లైఫ్ కఠినం చేశాయి. అడ్డుపడుతూ అల్లరి చేసే నిహారిక సోషల్ లైఫ్ కి దూరమైంది. ప్రస్తుతం అనేక ఆంక్షల మధ్య నిహారిక నిబంధనల మధ్య జీవితం గడుపుతున్నట్లు ఉహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

PREV
19
Niharika- Nagababu: ఆంక్షల మధ్య దుర్భరంగా నిహారిక లైఫ్?... ఫ్రీడమ్ మిస్ యూజ్ చేసిన ఫలితమేనా?
Niharika Konidela

స్వేచ్ఛను మిస్ యూజ్ చేసుకుంటే తర్వాత పరిస్థితులు కఠినతరమవుతాయి. దానికి నాగబాబు (Nagababu) డాటర్ నిహారిక లైఫ్ ఉదాహరణ. కూతురు నిహారికకు అమితంగా ప్రేమించే నాగబాబు ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చివరికి హీరోయిన్ అవుతానన్న ఒప్పుకున్నారు. నిహారిక హీరోయిన్ కావడం మెగా ఫ్యాన్స్ కి అసలు నచ్చలేదు. ఆమె హీరోయిన్ కావాలనే ఆలోచన విరమించుకోవాలంటూ గట్టిగా హెచ్చరించారు.

29
Niharika Konidela

విమర్శలు, హెచ్చరికలు ఎదురైనా నిహారిక తాను కోరుకున్న విధంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా మారిన అమ్మాయిగా రికార్డులకు ఎక్కింది. అయితే మెగా ఫ్యామిలీ నుండి ఆమెకు ఎటువంటి సప్పోర్ట్ లభించలేదు. దానితో ఆమెకు విజయాలు లభించలేదు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోతే తాము నిర్ణయించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నాగబాబు కండీషన్ పెట్టారు. దానికి లోబడి ఆమె పెళ్లికి ఒప్పుకున్నారు. డిసెంబర్ 2020లో నిహారిక(Niharika konidela) వివాహం ఘనంగా జరిగింది.

39
Nagababu - Niharika


పెళ్ళైనప్పటికీ నటిగా కొనసాగాలన్న కోరిక నిహారిక చంపుకోలేకపోయింది. అత్తమామలను, కట్టుకున్నవాడిని  ఒప్పించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంతో పాటు, కొత్త ప్రాజెక్ట్స్ షురూ చేశారు. అంత వరకూ బాగానే ఉంది. 

49


ఒకింటికి కోడలిగా వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ పద్ధతులు, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి నడుచుకోవాలి. కానీ నిహారిక మునుపటిలాగే ఉండాలనుకున్నారు. గతంలో మాదిరి ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు. ఆ వీడియోలో నిహారిక ట్రైనర్ వీపుపై కూర్చున్నారు. 

59

ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో వైరల్ కావడం జరిగింది. ఈ వీడియో చూసిన నిహారిక అత్తింటివారు ఫైర్ అయినట్లు సమాచారం. గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఏకంగా నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయాల్సి వచ్చిందనేది మీడియా కథనాల సారాంశం. వాస్తవం ఏదైనా చాలా పెద్ద వ్యవహారం నడిస్తే తప్ప లక్షల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ వదులుకోరు.

69

ఆ సంఘటన జరిగిన రోజుల వ్యవధిలో ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ (Fooding and Mink pub ride)లో నిహారిక పట్టుబడడం సంచలనం రేపింది. నిహారిక పోలీస్ స్టేషన్ లో కనిపించడంతో ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. చివరికి నాగబాబు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

79

150 మంది యువతీ యువకులు పట్టుబడ్డ ఈ కేసులో అతి కొద్ది మందిని మాత్రమే బాధ్యులను చేశారు. ధనవంతులు పిల్లలు కావడంతో పైరవీలతో అందరినీ కేసు నుండి పోలీసు తప్పించారు. ఓ బర్త్ డే పార్టీకి నిహారిక హాజరయ్యారని, ఆమె ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు.

89


నిహారిక డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనేది పక్కన పెడితే తెల్లవారు జాము 3గంటల వరకు పెళ్ళైన అమ్మాయికి పబ్స్ లో పనేంటి, అది కూడా తోడుగా భర్త లేకుండా.. అనే విమర్శలు తెరపైకి వచ్చాయి. 
నిహారికను అడ్డుపెట్టుకుని నాగబాబు ప్రత్యర్ధులు టార్గెట్ చేశారు. ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడ్డారు. ఈ విషయంలో గమ్మున ఉండటం తప్ప, ఏం మాట్లాడలేని పరిస్థితి నాగబాబుకు ఏర్పడింది. మెగా అభిమానులు కొంత మేర తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 

99


ఈ పరిణామాలు నిహారికను సోషల్ లైఫ్ కి దూరం చేశాయనేది లేటెస్ట్ టాక్. ఒకప్పటి ఫ్రీడమ్ ఆమెకు లేదట. కాలు బయటకు పెట్టాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఫ్రెండ్స్, పార్టీలు పూర్తిగా కట్ చేశారట. ఈ సంఘటన జరిగిన నాటి నుండి నిహారిక బయట కనిపించడం లేదు. ఇది వరకు తండ్రితో పాటు పలు టీవీ కార్యక్రమాల్లో సందడి చేసేవారు. ప్రస్తుతం వాటన్నింటికీ నిహారిక దూరమైపోయారు. 

click me!

Recommended Stories