Dhamaka Review:ధమాకా మూవీ ప్రీమియర్ రివ్యూ.. మాస్ మంత్రం రిపీట్ చేసిన రవితేజ

First Published | Dec 23, 2022, 6:55 AM IST

ఒక హిట్లు..ఒక ప్లాప్ కొడుతూ..జిగ్ జాగ్ లా పోతుంది మాస్ మహారాజ్ రవితేజ కెరీర్. అయినా అదే ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు మాస్ రాజా. ఈక్రమంలోనే ధమాకా మూవీతో ఈరోజు (డిసెంబర్ 23) ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ముందుగా యూఎస్ లో ప్రీమియర్స్ సందడి చేయగా.. ధమాకా ఎలా ఉంది..? ఎంత వరకూ ఆడియన్స్ ను  ఆకట్టుకుందో చూద్దాం. 

మాస్ మహారాజ్ రవితేజ ‌హీరోగా.. శ్రీలీల హీరోయిన్ గా నటించిన పక్కా మాస్ ఎంటర్టైనర్ ధమాకా. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ఈమూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు ప్రసాద్,వివేక్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ మాస్ మూవీ.. ఎంత వరకూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. యూఎస్ ప్రిమియర్స్ రిపోర్ట్ ఏంటీ చూద్దాం.. 

మరోసారి మాస్ ట్రీట్ ఇచ్చాడు రవితేజ. తన మాస్ ఆడియన్స్ కోసం డబుల్ ధమాకా చూపించాడు. ముఖ్యంగా ఈ సినిమా కథ చూసుకుంటే రెండు పాత్రల్లో రవితేజ అలరించాడు. ఈరెండు పాత్రల చుట్టూనే ఈ కథ నడుస్తుంది. స్వామి క్యారెక్టర్ లో రవితేజ ఒక మురికివాడలో నివసించే పేద, ఉద్యోగం లేని మాస్ పాత్ర.. ఇక మరో పాత్ర‌లో ఆనంద్ చక్రవర్తి  అనే మల్టీ మిలినీయర్ గా రవితేజ కనిపించారు. 


ఇందులో మల్టీ మిలీనియర్ రవితేజ వేల మందికి ఉపాధి కల్పిస్తుంటాడు. ఈ మల్టీ మిలినియర్ తండ్రిగా సచిన్ కేడ్కర్  నటించారు. అయితే ఈ కంపెనీని నందగోపాల్ పాత్రలో నటించిన జయరామ్ ఆక్రమించుకోవాలి అనిచూస్తాడు. ఈ విషయంలో డ్యూయల్ రోల్ చేసిన రవితేజ ఏం ప్లాన్ చేస్తారు.. ఎలా తమకంపెనీలను కాపాడుకుంటారు. అసలు ఈ ఇద్దరు పాత్రలకు ఉన్న లింక్ ఏమిటీ..? అనేది సినిమాచూసి తెలుసుకోవాల్సిందే. 

ఇక సినిమా ఫస్ట్ హాఫ్ వరకూ అంతా  రొటీన్‌గా ఉంటుంది,  మాస్ కు మంచి ఎంటర్టైన్మెట్ ను అందిస్తుంది. ఏం జరగబోతుంది అనేది కాస్త గెస్ చేసేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా రవితేజ మార్క్ హడావిడి కామెడీతో గందరగోళంగా ఉంటుంది. అయితే ఇది మాస్ కు బాగా నచ్చేలా ఉంటుంది. ఇక అసలు కథ.. సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. సెకండ్ హాఫ్ మూవీని కాస్త సీరియస్ గా నడిపించే ప్రయత్నంచేశాడు డైరెక్టర్ త్రినాథ్ రావ్. కాని ఇది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. 
 

Dhamaka

ఇక నటీనటులు పెర్ఫామెన్స్ విషయానికి వస్తే.. మాస్ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆయన మార్క్ కామెడీతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే.. రవితేజ రోటీన్ కామెడీ కనిపించింది. ఫ్యాన్స్ ను ఇది బాగా  ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఇక శ్రీలీల రవితేజ జోడీగా అద్భుతం చేసిందని చెప్పాలి. ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా..ఎక్కడా అది కనిపించకుండా మానేజ్ చేశారు. రవితేజకు పోటీగా ఆమె పెర్ఫామ్ చేసింది. ఇక జయరామ్, సచిన్, తనికెళ్ళ భరణి వారి పాత్రల పరిదిమేర న్యాయంచేశారు.

Dhamaka Telugu Movie Trailer ravi teja jayaram

ఇక దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన టాలెంట్ ఇంతకు ముందు సినిమాల్లో చూసిందే. డైరెక్షన్ ఎంత బాగా ఉన్నా.. ఆయన తీసుకున్న కథ కొత్తదేమి కాదు. ఈ జానర్ లో ఎప్పటినుంచో సినిమాలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ ఇయర్స్ లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే కొన్ని సినిమాలు వచ్చాయి. సినిమాకుభీమ్స్ మ్యూజిక్ మ్యాజిక్ బాగా పనిచేసిందని చెప్పాలి. 

ఇక ఓవర్ ఆల్ గా ఈమూవీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ముందు ముందు చూడాలి. రవితేజ ఫ్యాన్స్ కు .. మాస్ ఆడియన్స్ కు మాత్రం మంచి మీల్స్ పెట్టారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు.. శ్రీలీల గ్లామర్ మూవీకి ప్లస్ అవుతుందని చెప్పాలి. మరి ప్రేక్షకులు ఏరకంగా ఈసినిమాను రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 

Latest Videos

click me!