శ్రీలీల 21 ఏళ్ల యంగ్ బ్యూటీ, రవితేజ ఐదుపదులు దాటిన సీనియర్ హీరో. దీనితో ఈ కాంబోపై సెటైర్లు పడుతూనే ఉన్నాయి. సీనియర్లతో కుర్ర హీరోయిన్లు.. వయసు బాగా తక్కువ ఉన్నవారు నటించడం కొత్తకాదు. కానీ ఎందుకనో శ్రీలీల, రవితేజ టార్గెట్ అయ్యారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్స్ తో ఈ తరం హీరోయిన్లు ఆడిపాడడం చూస్తూనే ఉన్నాం.