Ragini: 13 ఏళ్లకే పెళ్లి, 14 ఏళ్లకు కొడుకు.. భర్త వదిలేసి వెళ్లిపోయాడు.. నటి రాగిణి లైఫ్‌లో ఇన్ని కష్టాలు ఉన్నాయా?

Published : Oct 06, 2026, 08:37 AM IST

Ragini: అమృతం సీరియల్‌లో కడుపుబ్బా నవ్వించిన నటీనటులలో రాగిణి కూడా ఒకరు. అంజి భార్య ‘శాంత’గా ఆమె పాత్రను ఎవరూ మరచిపోలేరు. అటువంటి నటి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా? భర్త చేతిలో మోసపోయిన రాగిణి ఎలా జీవితాన్ని నెట్టుకొచ్చారంటే...

PREV
13
నవ్వుల వెనుక కన్నీటి కథ: నటి రాగిణి జీవిత పోరాటం

30 ఏళ్ల సినీ జీవితం, 550కి పైగా సీరియల్స్, 190కి పైగా సినిమాలు.. ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి నటిగా ఎదిగారు రాగిణి. వెండితెరపై, బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ పాత్ర ఏదైనా తనదైన నటనతో అలరించే సీనియర్ నటి రాగిణి వ్యక్తిగత జీవితం వెనుక ఒక పెద్ద విషాదం, అంతకుమించిన సాహస పోరాటం ఉన్నాయి. తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి.

చిన్నతనంలోనే వివాహం - నరకం చూపించిన భర్త

రాగిణి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం.. ఆమె ఫ్యామిలీలో 14 మంది సంతానం. అందులో రాగిణి 12వ బిడ్డ. కుటుంబ పరిస్థితుల వల్ల రాగిణికి కేవలం 13 ఏళ్ల చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. ఆటపాటలతో గడపాల్సిన వయసులో బాధ్యతలు నెత్తిన పడ్డాయి. వివాహమైన ఏడాదికే, అంటే 14 ఏళ్లకే ఆమె ఒక బాబుకు జన్మనిచ్చారు. అయితే, అండగా నిలవాల్సిన భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్ర హింసకు గురిచేసేవాడు. డబ్బు కోసం వేధించేవాడు. పెళ్లైన ఏడాదికే భర్త ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. దాంతో రాగిణి జీవితం ఒంటరి అయిపోయింది.

23
నెలకు రూ. 3,000లతో జీవితం మొదలుపెట్టి..

భర్త వదిలేసినా కూడా రాగిణి భయపడలేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. పసికందును చేతిలో పట్టుకుని, బతుకుదెరువు కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఊరిలో పక్షవాతంతో మంచాన పడ్డ తండ్రిని, తల్లిని కూడా తన దగ్గరకే తీసుకొచ్చారు రాగిణి. ఒకవైపు పసిపిల్లవాడు, మరోవైపు అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులు, చుట్టుముట్టిన ఆర్థిక కష్టాలు ఉన్నా ఆమె ధైర్యం వీడలేదు.

హైదరాబాద్‌లో డాన్స్ గ్రూపుల్లో డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తే ₹500 ఇచ్చేవారు. నెలకు 6 ప్రోగ్రామ్‌లు చేస్తే ₹3,000 వచ్చేవి. అందులో ₹750 ఇంటి అద్దె కట్టి, ₹1,000 తండ్రి మందులకు, మరో వెయ్యి రూపాయలు ఇంటి ఖర్చులకు కేటాయించేవారు. టీవీ ఆఫీసులు, స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరగడానికి రూ. 200 నుంచి రూ. 300 బస్సు ఛార్జీల కోసం దాచుకునేవారు.

మరోవైపు కొడుకులను కూడా తానే పెంచి పెద్ద చేశారు. హైదరాబాద్‌లోనే చదివించారు. కొడుకులను బాగా చదివించి, పెళ్లిళ్లు చేశారు. తల్లి పడిన కష్టాన్ని అర్థం చేసుకున్న ఆమె కుమారుడు కిరణ్‌తో పాటు ఇద్దరు కొడుకులు కూడా బాగా చదువుకుని, సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడి సొంత ఇళ్లు కూడా కట్టుకున్నారు. ఈ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు రాగిణి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

33
పరిశ్రమలో ఎదురైన సవాళ్లు

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో క్యాస్టింగ్ కౌచ్ వంటి పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. తన ప్రవర్తన, సంస్కారంతోనే పరిశ్రమలో గౌరవాన్ని కాపాడుకున్నానని ఆమె స్పష్టం చేశారు. భర్త వదిలేసినప్పటికీ వేరే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు రాలేదని రాగిణి అన్నారు. "పిల్లలను బాగా చదివించాలి, కష్టపడాలి" అనే ఆలోచనే తనలో ఉండేదన్నారు. ఇండస్ట్రీలో కూడా ఎన్నో కష్టాలు పడి అవకాశాలు సాధించి, ఇప్పటివరకు నటించగలుగుతున్నానని చెప్పారు.

క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ..

ఇక క్యాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే.. "ఇండస్ట్రీలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే ఎలాంటి సమస్య రాదు. అలా కాకుండా 'ఏంటి సార్ బాగున్నారా' అంటూ దగ్గరగా వెళ్తే, మన వాలకం చూసి 'రాత్రికి వస్తావా?' అంటారు. అలా కాకుండా 'నమస్కారం సార్' అని సంస్కారంగా మాట్లాడితే ఎవరూ మన జోలికి రారు. మన ప్రవర్తనను బట్టే ఎదుటివారి ప్రతిస్పందన ఉంటుంది. చేతులు జోడించి నమస్కారం అంటే ఎదుటివారి రియాక్షన్ ఒకలా ఉంటుంది. అదే వెళ్లి అతని పక్కన కూర్చుని భుజం రుద్దుతూ సార్.. అని సాగదీస్తే ఏదో ఒకటి అడుగుతారు. నాకు ఇండస్ట్రీలో అలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వలేదు" అని రాగిణి చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories