కోటీశ్వరుల కూతుళ్లను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోలు.. అత్తామామల బిజినెస్ లు ఎంటో తెలుసా?

First Published Oct 9, 2022, 4:39 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ లుగా వెలుగొందుతున్న మన హీరోలు ఎలాంటి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో తెలుసా? వాళ్ల అత్తామామల వ్యాపారాలు, ఆస్తుల వివరాలు షాకింగ్ గా ఉన్నాయి.  

టాలీవుడ్ లో ప్రస్తుత స్టార్ హీరోల్లో మంచి క్రేజ్ ఉన్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). తారక్ పెళ్లి 2011 మే 5న వైభవంగా జరిగింది. అప్పటికే సీనియర్ ఎన్టీఆర్ మనవడు కావడంతో పెద్దింటి సంబంధమే వచ్చింది. దీంతో తారక్ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించారు. చిత్రపరిశ్రమలో గ్రాండ్ గా జరిగిన వివాహాల్లో ఎన్టీఆర్ పెళ్లి కూడా ఒకటి.  

రియల్టర్ మరియు వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. లక్ష్మిణి ప్రణతి నాన్న ఓ మీడియా సంస్థకు అధిపతి కావడంతో పాటు.. రియల్ ఎస్టేట్ లోనూ రాణిస్తున్నారు. కోట్లల్లో సంపాదను ఆర్జిస్తున్నారు. 
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పెళ్లి కూడా  యంగ్ టైగర్  ఎన్టీఆర్ చేసుకున్న ఏడాదే ఘనంగా జరిగింది. అల్లు అరవింద్ కొడుకైనా అల్లు అర్జున్ 2011లో స్నేహా రెడ్డిని పెళ్లిచేసుకున్నారు. వీరిది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. స్నేహారెడ్డి ఫాదర్ ప్రముఖ వ్యాపార వేత్త.  తల్లి కవిత  కూడా బిజినెస్ లు చూసుకుంటుంది. వీరికి నగరంలో విద్యాసంస్థలతో పాటు ఇతర చిన్న బిజినెస్ లు ఉన్నాయి.
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కూడా  సంపన్నుల  ఇంటికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. 2012 చెర్రీ వివాహం అపోలో సంస్థల అధినేత అనిల్ కామినేని కూతురు ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు. 
 

రామ్ చరణ్ - ఉపాసన  వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఉపాసన తండ్రికి అపోలో ఆస్పత్రులతో పాటు ఇతర చిన్న వ్యాపారాలు కూడా ఉన్నట్టు సమాచారం. వీరి ఆస్తులు కోట్లల్లో ఉండటం విశేషం. 

ఆరడుగుల ఆజానుభావుడు, హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) తన స్నేహితురాలు, డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో వ్యవస్థాపకురాలు మిహీకా బజాజ్‌ ను 8 ఆగస్టు 2020న పెళ్లి చేసుకున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో వీరి నిశ్చితార్థం, వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. రానా అత్తగారు క్రిసాల జ్యువలరీస్ కు ఓనర్. గోల్డ్ సంబంధిత వ్యాపారాలు చేస్తుంటారు. 
 

click me!