2024లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది మార్కో మూవీ. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలో ఏ రేటింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా మార్కో రికార్డ్ క్రియేట్ చేసింది.
మార్కో మూవీ తెలుగు, హిందీ వెర్షన్లు జనవరి 1న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తమిళంలో ఈ రోజు అంటే జనవరి 3న ఈ మూవీ విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో తెలుగు, హిందీ వెర్షన్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన మార్కో మూవీలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. సిద్ధిఖీ, జగదీష్, కబీర్ సింగ్ దుహాన్ కీలక పాత్రల్లో నటించారు. స్టైలిష్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన మార్కోకు హనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు. ఇక మార్కో హిందీ మరియు తెలుగు వెర్షన్లు కొత్త సంవత్సరం రోజున మలయాళాన్ని మించిపోయి షాక్ ఇచ్చాయి.
కొత్త సంవత్సరం రోజున మార్కో చిత్రం 1.4 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేసింది. అలాగే ఈ చిత్రం తెలుగులో కొత్త సంవత్సరం రోజున విడుదలై 1.3 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కొత్త సంవత్సరం రోజున హిందీ మరియు తెలుగు వెర్షన్‌లు మలయాళ వెర్షన్ కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది, ఎందుకంటే ఈ చిత్రం కేరళలో 1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మార్కో యొక్క హిందీ , తెలుగు వెర్షన్లు కొత్త సంవత్సరం రోజున మలయాళాన్ని మించిపోయాయి.
Unni Mukundan starrer Marcos collection report out
మార్కో మూవీ ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ సినిమా హిందీ, తెలుగు వెర్షన్ పైరసీ సైట్స్‌లో దర్శనమిచ్చింది. ఈ లీక్‌పై సినిమా యూనిట్ రియాక్ట్ అయ్యింది. సినిమాను లీక్ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు.
అయినప్పటికీ ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఇది 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. అలాగే మార్కో తమిళ వెర్షన్ కూడా దుమ్ము రేపుతుందని భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద అన్ని భాషల వసూళ్లు రాబట్టడం వల్ల ఈ వీకెండ్ సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు ఉన్ని ముకుందన్. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించాడు.ఆ తర్వాత అనుష్క భాగమతి, సమంత యశోదతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. హీరోగానే కాకుండా మలయాళంలో ప్రొడ్యూసర్‌గా, సింగర్‌గా టాలెంట్‌ను నిరూపించుకున్నాడు ఉన్ని ముకుందన్. ఇప్పుడు మార్కో ఉన్ని ముకుందన్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది.
marco telugu release
మార్కో మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. థియేటర్లలో రిలీజైన నెల నుంచి నలభై ఐదు రోజుల తర్వాతే ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేసేలా నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. జనవరి నెలాఖరున లేదా...ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారంజరుగుతోంది.