2025ని శాసించబోతున్న మెగా ఫ్యామిలీ

First Published | Jan 3, 2025, 7:51 AM IST

2025 సంవత్సరం మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోల సినిమాలతో ప్రేక్షకులకు పండగ కానుంది. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', చిరంజీవి 'విశ్వంభర', పవన్ కళ్యాణ్ 'OG', 'హరి హర వీరమల్లు' వంటి సినిమాలు విడుదల కానున్నాయి.

game changer, og, Chiranjeevi, pawan kalyan


కొత్త సంవత్సరం వచ్చేసింది. సంక్రాంతి నుంచి సినిమాల వరద ప్రారంభం కానుంది. స్టార్ హీరోలు సినిమాలు భాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టనున్నాయి. వీటిలో ఎక్కువ శాతం మెగా కాంపౌండ్ కు చెందినవే కావటం విశేషం. వాస్తవానికి  2024లో మెగా ఫ్యామిలీలోని స్టార్ హీరోల  నుంచి  చెప్పుకోదగ్గ రిలీజ్ లు లేవు. దాంతో మెగాభిమానుల దృష్టి మొత్తం 2025 పైనే ఉంది. తమ హీరోల సినిమాలే కొత్త సంవత్సరం దుమ్ము రేపుతాయని భావిస్తున్నారు.
 


2024లో  పవన్ కళ్యాణ్ తన రాజకీయ కమిట్ మెంట్స్ తో బిజీ అయ్యి తన సినిమాల షూటింగ్ లో పెద్దగా పాల్గొనలేదు. చిరంజీవి కూడా విశ్వంభర కోసం వశిష్టతో సినిమా సెట్ చేసి, షూట్ మొదలెట్టడానికి టైమ్ తీసుకున్నాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అయితే చాలాకాలంగా ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ మెగా ఫ్యామిలీ స్టార్స్ అంతా 2025లో  వరస రిలీజ్ లు పెట్టుకున్నారు. తమ అభిమానులకు, సినిమా లవర్స్ కు  పండగ చేయబోతున్నారు.


school festival

గేమ్ ఛేంజర్


ఈ మెగా హీరోల రిలీజ్ ల లిస్ట్‌లో మొదటిది గేమ్ ఛేంజర్, ఇది సంక్రాంతికి ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండటంతో పాటు సినిమా కూడా భారీ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోందనే అంచనాలు ఉన్నాయి.  మూడేళ్ళకు పైగా సుదీర్ఘ నిర్మాణంలో ఉండి ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష పెట్టిన దర్శకుడు శంకర్ ఎట్టకేలకు రామ్ చరణ్ ని మూడు షేడ్స్ లో చూపించేందుకు సిద్ధం చేశాడు. నిర్మాతగా దిల్ రాజు 50వ సినిమాగా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారనేది అర్దమవుతోంది.  హైదరాబాద్ ఏఎంబిలో రాజమౌళి అతిథిగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హీరోతో పాటు ప్రధాన క్యాస్టింగ్ మొత్తం పాల్గొంది. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టే రెండున్నర నిమిషాలకు దగ్గరగా ఉన్న ట్రైలర్ వీడియోని రిలీజ్ చేశారు.  ట్రైలర్ కు అద్బమైన రెస్పాన్స్ వచ్చింది. 

HMPV Outbreak China


 విశ్వంభర ఇప్పటికే సమ్మర్ సీజన్‌లో విడుదల చేయడానికి షెడ్యూల్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ టాక్ దక్కింది. దీంతో ఈ సినిమా యూనిట్ ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. అభిమానులకు అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. 


OG 

ఓజీ సినిమా స్టోరీ.. 1980,90లలో జరిగే కథ. OG అంటే..ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని తెలిసిందే.  ఓవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారనే ఉత్సాహం, సంతోషం ఉన్నా.. ఆయన తన సినిమాలకి బ్రేక్ ఇవ్వడం అభిమానులని నిరూత్సాహపరిచింది.

ముఖ్యంగా 2024లో  రిలీజ్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఓజీ' సినిమా పై వారి ఆశలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది  చిత్రం. సాహో వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఓజీ. పవన్‌ కళ్యాణ్ ను గ్యాంగ్‌స్టర్‌గా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు.
 

హరి హర వీర మల్లు షూటింగ్ కూడా మళ్లీ మొదలైంది. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నారనే ప్రకటన వచ్చింది. మొదటి పార్ట్‌ విడుదల తర్వాత ఓజీ ఉంటుంది, ఆ తర్వాత రెండో పార్ట్‌ ఉంటుందని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. కానీ హరి హర వీరమల్లు సినిమా విషయంలో చాలా ఆలస్యం జరుగుతుంది. భారీ ఎత్తున గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉండటంతో పాటు, పవన్‌ కళ్యాణ్‌ కి సంబంధించిన సన్నివేశాలు ఇంకా చాలానే ఉన్నాయి
 

మెగా ఫ్యామిలీ స్టార్లు మినహా అల్లు అర్జున్,  మహేష్ బాబులకు 2025 లో విడుదలలు లేవు. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ది రాజా సాబ్‌తో ప్రభాస్ ప్రేక్షకులను కలవనున్నారు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాబట్టి  టాలీవుడ్  స్టార్ల నుంచి వచ్చే ఆరు భారీ సినిమాల్లో నాలుగు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినవే కావడం విశేషం. 

Latest Videos

click me!