అలీ చెప్పే కొన్ని మాటలు, డైలాగులు అతడికి మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఉంటాయి. కాట్రవల్లీ, ఎంద చాట లాంటి మాటలు బాగా పాపులర్ అయ్యాయి. రాజమండ్రి నుంచి పేద కుటుంబం నుంచి వచ్చిన అలీ .. డైరెక్టర్లు, నిర్మాతలు, నటులతో పరిచయాలు ఏర్పరుచుకుంటూ అవకాశాలు దక్కించుకున్నాడు. అలీకి ఉన్న ప్రత్యేకమైన మ్యానరిజమ్స్, కామెడీ టైమింగ్ వల్ల అతడికి హీరోగా కూడా అవకాశాలు వరించాయి.