ఆ డీలింగ్ కి మేనేజర్ కూడా ఒప్పుకుంటాడు. పూజలో నువ్వు కూర్చునే అంత సీను లేదు అని మాన్సీ కి చెప్పి గుడి మేనేజర్ ని అక్కడ నుంచి పంపించేస్తుంది అంజలి. సడన్ గా అక్కడికి వచ్చిన అంజలిని చూసి షాక్ అవుతుంది మాన్సీ. నువ్వు ఇంక మారవా.. గుడిలో కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా. అయినా అను లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు ఆర్య సార్ గుండెల్లో, ఊపిరిలో అను ఉంది. వాళ్ల మధ్య ఉన్న దూరం శాశ్వతం కాదు.రాముడు బంగారు సీతమ్మని పక్కన పెట్టుకొని యాగం చేశాడంట.. ఆంటీ చెప్పారు.