ఎపిసోడ్ ప్రారంభంలో అప్పుడే మెలకువ వచ్చిన అనుని ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఆర్య. మనకి కవల పిల్లలు పుట్టారు అని చెప్తాడు. ఆనందపడుతుంది అను. ఇంత చిన్న పొట్టలో ఎలా పుట్టారు అని అడుగుతాడు ఆర్య. ఎలా పుట్టారో తెలియదు కానీ ఎందుకు పుట్టారో తెలుసు. మీకు జూనియర్ అను కావాలి అందుకే పాప. నాకు జూనియర్ ఆర్య వర్ధన్ కావాలి అందుకే బాబు పుట్టాడు. అందుకే మనం దేవుడికి థాంక్స్ చెప్పాలి అంటుంది అను. ఇంతలో ఇద్దరు నర్సులు తీసుకువచ్చి పిల్లిలిద్దరినీ వాళ్ళిద్దరి చేతిలో పెడతారు. ఇద్దరూ ఆనందంతో పొంగిపోతారు.