Ugram Movie Review
కథ:
హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోగా పెద్ద మొత్తంలో ఆడపిల్లలు, మహిళలు కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివ కుమార్ (అల్లరి నరేష్) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివ కుమార్ కి ఓ భయంకరమైన నేపథ్యం ఉంటుంది. ఈ శివ కుమార్ ఎవరు? ప్రజల అదృశ్యం వెనుక ఉంది ఎవరు? శివ కుమార్ ఈ మాఫియాకు ఎలా చెక్ పెట్టారు? అనేది కథ...
Ugram Movie Review
కామెడీ చిత్రాల హీరోగా తనకంటూ ఓ జోనర్, ఇమేజ్ క్రియేట్ చేసుకొని సక్సెస్ అయ్యారు అల్లరి నరేష్. ఈ తరం రాజేంద్రప్రసాద్ అని చెప్పొచ్చు. ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒకే తరహా చిత్రాలు చేస్తుంటే కొంత కాలానికి మొనాటమీ వచ్చేస్తుంది. ప్రేక్షకుల్లో ఆసక్తి పోతుంది. అల్లరి నరేష్ విషయంలో అదే జరిగింది. ఆయన కామెడీ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడం లేదు.
Ugram Movie Review
దీంతో పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. తన పేరులో ఇకపై అల్లరి ఉండదని నరేష్ చెప్పారు. అంటే కామెడీ చిత్రాలు చేయబోనని హింట్ ఇచ్చారు. నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం ఇదే తరహాలో సీరియస్ అండ్ సోషల్ సబ్జక్ట్స్ తో తెరకెక్కాయి. లేటెస్ట్ మూవీ ఉగ్రం కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. సీరియస్ కాప్ స్టోరీ.
Ugram Movie Review
సిన్సియర్ అండ్ రూత్ లెస్ కాప్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ మెప్పించారా? ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ ఎలిమిమెంట్స్ ఉన్నాయా? ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే... యూఎస్ లో ఉగ్రం మూవీ ప్రీమియర్స్ ముగిశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం తెలియజేస్తున్నారు.
Ugram Movie Review
ఉగ్రం మూవీ అవుట్ అండ్ అవుట్ పోలీస్ యాక్షన్ డ్రామా. సస్పెన్సు ఎలిమెంట్స్ ఉన్నాయి. దర్శకుడు ప్రారంభం సన్నివేశాలతో క్యూరియాసిటీ పెంచారు. శివ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ఏంటనే ఒక ఉత్కంఠ ఆడియన్స్ లో కలిగించారు. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది.
Ugram Movie Review
సీరియస్ పోలీస్ రోల్ లో అల్లరి నరేష్ మెప్పించారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మెప్పిస్తుంది. పాత్రలో ఒదిగిపోయి నటించగా ఆయనలోని కామెడీ యాంగిల్ గుర్తుకు రాదు. సాధారణంగా కామెడీ చిత్రాల హీరోకి ఈ రేంజ్ ఎలివేషన్స్ అవసరమా అనే భావన కలుగుతుంది. అల్లరి నరేష్ ఆ భావన కలగకుండా చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు న్యాయం చేశాయి.
Ugram Movie Review
అయితే రోటీని మాస్ యాక్షన్ డ్రామాలా ఉగ్రం సాగిందంటున్నారు. అవసరానికి మించిన యాక్షన్, హీరోయిజం తో నడిపించారు. హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ అంతగా వర్క్ అవుట్ కాలేదన్నది ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ అభిప్రాయం. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగిందని అంటున్నారు.
సెకండ్ హాఫ్ సైతం చెప్పుకోదగ్గ ఆసక్తిని దర్శకుడు క్రియేట్ చేయలేకపోయారు. మొత్తంగా చెప్పాలంటే మంచి స్టోరీ లైన్ తో పాటు సెటప్ డెవలప్ చేసిన దర్శకుడు దాన్ని ప్రభావంతంగా తెరకెక్కించలేకపోయాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ పెట్టి అవసరానికి మించిన హీరోయిజం పండించారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అల్లరి నరేష్ పెర్ఫార్మన్స్ మెప్పిస్తుంది. కథనంలో పదును లేదంటున్నారు. ఇది ప్రీమియర్స్ ద్వారా ఉగ్రం మూవీ గురించి అందుతున్న సమాచారం. పూర్తి రివ్యూ కోసం వేచి చూడండి...