Prema Entha maduram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha maduram)సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక మాన్సీ వాళ్ళ ఫ్రెండ్స్ తో మందు తాగుతూ ఉండగా నీరజ్ (Neeraj) అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ పై విరుచుకు పడతాడు.
అంతేకాకుండా గెట్ అవుట్ అని వాళ్ళ ఫ్రెండ్స్ ని బయటకు పంపించేశాడు. ఆ తర్వాత మాన్సీ (Mansi) నా ఇష్టాలు ను ఎవరికోసం మానుకోను అంటూ మళ్లీ డ్రింక్ చేస్తూ ఉండగా నీరజ్ (Neeraj) దానికి అసహనం వ్యక్తం చేసి మాన్సీ చెంపపై గట్టిగా ఒకటి ఇస్తాడు. ఇక దాంతో మాన్సీ కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.
25
మరోవైపు రాగసుధ (Ragasudha) రెస్టారెంట్ వాష్ రూమ్ లో చీర వాష్ చేసుకుని బయటకు వస్తూ ఉండగా మీరా రాగసుధ చూసి గుర్తు పడుతుంది. ఇక మీర (Meera) అసలు ఎవరు మీరు? ఆరోజు ఎందుకు అసలు ఆఫీసుకు వచ్చారు అని అడుగుతుంది. ఇక రాగసుధ టెన్షన్ పడుతూ అక్కడినుంచి పారిపోతుంది.
35
ఇక ఒంటరిగా కూర్చున్న అను (Anu) ని ఆర్య చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. ఇక అను ఫ్రెండ్ తో లంచ్ చేయడానికి వచ్చాను అని కవర్ చేసుకుంటుంది. ఇక ఆర్య మీ ఫ్రెండ్ వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటాడు. ఇక మాన్సీ కారు లో ఫాస్ట్ గా వెళుతుండగా అను (Anu) చూస్తుంది.
45
మరోవైపు సుబ్బు (Subbu) వాళ్ళ ఇంట్లో దేవుడి పటాలు వెనక రాగసుధ దాచిన తుఫాకి ను చూసేస్తాడు. ఒక వైపు మాన్సీ కార్ లో డ్రింక్ చేస్తూ వెళుతుండగా మరొక కారులో అను నీరజ్ లు వెంబడిస్తారు. ఈ క్రమంలో మాన్సీ (Mansi) ట్రాఫిక్ పోలీస్ ల ను క్రాస్ చేసి ఒక చెట్టు కు కారును గుద్దుతుంది.
55
ఇక ఈలోపు అక్కడకు అను (Anu) , నీరజ్ లు వచ్చి మాన్సీ ను వేరొక కార్ లోకి షిఫ్ట్ చేసి పోలీసులకు దొరకకుండా తీసుకు వెళ్ళిపోతారు. కానీ ఆ కారులో మాన్సీ తో పాటు అను ఒకటే ఉంటుంది. నీరజ్ (Neeraj) అక్కడే ఆగిపోతాడు. ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.