హాలీవుడ్ స్టార్స్ తో కూడా
తర్వాత ఆమె DJ హుస్సేన్‌తో మనీషా కోయిరాలా డేటింగ్ చేసినట్టు సమాచారం. తర్వాత నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీతో ఈ హీరోయిన్ కు బంధం ఏర్పడింది. వీరి బంధం కూడా కొంత కాలానికే ముగిసింది. అనంతరం నటుడు ఆర్యన్ వైద్, ఆస్ట్రేలియన్ రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్ లాంటి వ్యక్తులతో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ లిస్ట్ అక్కడితో ఆగలేదు. ఈ జాబితాలో వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు తారిక్ ప్రేమ్‌జీ, మోడల్ రాజీవ్ మూల్‌చందానీ, సంగీత దర్శకుడు సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్‌లు కూడా ఉన్నారు. అయితే వీటిలో కొన్ని సంబంధాలు మనీషా తాను స్వయంగా అంగీకరించినవైతే, మరికొన్ని మీడియాలో వైరల్ అయిన రూమర్స్.