మణికంఠ ఫేక్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చిన నాగార్జున, బిగ్ బాస్ లో అతని జర్నీ ఎందుకు చూపించలేదు..?

First Published | Oct 21, 2024, 12:27 AM IST

బిగ్ బాస్ హౌస్ నుంచి మణింకఠ ఎలిమినేట్అయ్యి వెళ్లిపోయాడు. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మణికంఠ నిజంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయాడా..? లేదా సీక్రేట్ రూమ్ కు పంపించారా..? నాగార్జున ఇచ్చి హింట్ ఏంటి..?  

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో లిమిట్ లెస్ ట్విస్ట్ లు.. లిమిట్ లెస్ సర్ ప్రైజ్ లు కూడా ఇస్తూ వస్తున్నాడు బిగ్ బాస్. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.. ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు మణికంఠ. బిగ్ బాస్ హౌస్ లో ప్రెజర్ ను అతను హ్యాండిల్ చేయలేకపోతున్నా అన్నాడు. దాంతో రెండు మూడు ఛాన్స్ లు ఇచ్చాడు నాగార్జున. 

హౌస్ లో ఉండాలి అని అనుకుంటున్నావా లేదా.. అని ఒకటికి పదిసార్లు అడిగాడు. సో ఫైనల్ గా మణింకఠ బయటకు వెళ్లాలి అనే అనుకున్నాడు. తన నిర్ణయం ప్రకారం అతను ఎలిమినేట్ అయ్యాడు. అయితే మణికంఠ సొంత నిర్ణయం ప్రకారం ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు నాగార్జున. స్టేజ్ మీదకు పిలిచి.. ధనాధన్ మాట్లాడించి పంపించేశారు. అయితే ఇక్కడే బిగ్ బాస్ ట్వస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చే అవకాశం ఉంది. ఏంటంటే.. ఎవరు ఎలిమినేట్ అయినా సరే.. ఆకంటెస్టెంట్ జర్నీ ని చూపించాల్సి ఉంటుంది. 

కాని మణికంఠ విషయంలో అది జరగలేదు. అంతే కాదు ఎపిసోడ్ అంతా అయిపోయిన తరువాత నాగార్జున వెళ్తూ.. వెళ్తూ.. గుర్తు పెట్టుకోండి ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ అన్నీ లిమిట్ లెస్ ట్విస్ట్ ఉ.. లిమిట్ లెస్ గా ఉంటాయి అని చెప్పిమరీ వెళ్ళాడు. ఈకరకంగా చూసుకుంటే మణింకఠ ను నిజంగా బయటకు పంపించారా.. లేక  సీక్రేట్ రూమ్ లో ఉంచారా అనేది అర్ధం కావడంలేదు. ఎలిమినేట్ అయిన అందరిని యాక్టివిటీ ఏరియా నుంచి డైరెక్ట్ గా స్టేజ్ మీదకు తీసుకువస్తారు. కాని మణికంఠను మాత్రం మెయిట్ గేట్ నుంచి స్టేజ్ మీదకు రావల్సిందిగా చెప్పారునాగ్. 

ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా నాగమణింకఠ ఎలిమినేషన్ జరగలేదని.. ఇదంతా బిగ్ బాస్ డ్రామా అయ్యి ఉండొచ్చు.. అతను సీక్రేట్ రూమ్ లో.. ఆడియన్స్ కు కూడా తెలియకుండా సీక్రేట్ గా ఉన్నడని అంటున్నారు. ఇక గౌతమ్ ను పంపించలేదు కాబట్టి.. నెక్ట్స్ ీక్ రెండు ఎలిమినేషన్లు కాని.. మిడ్ వీక్  ఎలిమినేషన్ కాని ఉండే అవకాశం ఉంది.  సో మణికంఠ నిజగానే బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయాడా..? 


ఇక ఈ రోజు ఎపిసోడ్ లో నామినేషన్స్ లో చివరిగా మణింకఠ, గౌతమ్ మాత్రమే మిగిలారు. వారిని యాక్టీవిటీ రూమ్ కు పిలిచారు నాగార్జున. ఇక సరిగ్గా అదేటైమ్ లో ఇంట్లో ఉన్న వారికి మణికంఠ మాట్లాడిన వీడియో ప్లే చేశారు. అందులో మణికంఠ ఆడియన్స్ కు రిక్వెస్ట్ చేసుకున్నది క్లియర్ గా వినిపించింది. తనవల్ల కావడంలేదని.. బయటువెళ్ళిపోవాలి అనుకుంటున్నట్టు మణింకఠ తెలిపాడు. 

అంతే కాదు తనకు అసలు ఓటు వేయొద్దంటూ వేడుకున్నాడు. ఆ వీడియో వాళ్లకు చూపించి.. మణికంట ఇంట్లో ఉండాలి అని ఎంత మంది అనుకుంటున్నారు. ఉండకూడదు అని ఎవరు అనుకుంటున్నారు అని అందరిని అడిగాడు నాగ్. దాంతో  నయని పావని.. మెహబూబ్, అవినాష్ మాత్రమే మణింకఠ ఉంటేబాగుంటుంది అనుకున్నారు. మిగతా వారు అంతా మణింకఠ వెళ్లిపోతేనే మంచిది అన్నారు. అయితే అవినాష్ అయితే మనస్పూర్తిగా అన్నట్టు అనిపించేదు. 

ఒక వేళ మణికంఠను సీక్రేట్ రూమ్ లోపెడతారేమో.. అనుకుని సేఫ్ గేమ్ ఆడినట్టుగా చెప్పాడు. ఇక మిగతావారిలో నిఖిల్, పృధ్వీ, యష్మి, విష్ణు ప్రియ అయితే ఏదో మణికంఠ చెప్పాడు కాబట్టి.. అతను బయటు వెళ్తేనేమంచిది అని అన్నారు కాని.. వారి మనస్సుల్లో మాత్రం మణికంఠ బయటకు వెళ్ళిపోవాలి అనే ఉంది. సో అదే బయట పెట్టారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మణికంఠ బయటకు వెళ్లిపోవాలి కాబట్టి వెళ్తున్నాడు. 

కాని ఆడియన్స్ డెసిషన్ ఎలా ఉంది అని చూస్తే.. గౌతమ్ రెడ్ జోన్.. మణికంఠ గ్రీన్ జోన్ లో ఉన్నారు. సో మణికి ఓటింగ్ చాలా వచ్చింది. మణి నిర్ణయం వల్ల గౌతమ్ సేవ్ అయ్యి హౌస్ లోకి వచ్చాడు. లేకుంటే ఈ వారం మణికంఠ సేవ్ అయ్యి.. గౌతమ్ బయటకువెళ్లిపోయేవాడేమో. ఇదంతా డిస్కర్షన్ జరుగుతండగానే మరో వైపు అవినాష్ రోహిణి చెవులో గుసగుసలు వినిపించాడు. ఒక వేళ మణిని సీక్రేట్ రూమ్ లో పెడతారేమో అని అన్నాడు.

ఇక మణికంఠ వెళ్లిపోవడంతో హౌస్ లో కాస్త ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ లేక వెలవెల బోయే అవకాశం ఉంది. అతను తెలియకుండానే చాలామంది అభిమానులను సాధించాడు. వారంతా డిస్సపాయింట్ అవుతున్నాు. ఇక మణి వెళ్తూ.. వెళ్తు.. విష్ణు ప్రియ,చ నయనీ పావని, మెహబూబ్, హరితేజ, అవినాష్ లను ఓడ ఎక్కించి విన్నింగ్ వైపు నడిపించాడు.

ఇక నిఖిల్, టేస్టి తేజ, ప్రేరణ, గౌతమ్, పృధ్వీను నిటిలో ముంచి వారికి హెచ్చరిక జారీ చేశాడు. సో ఇలా  మదాదాపు ఈ వారం అంతా పెద్దగా యాక్టీవ్ గా లేడు మణికంఠ. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓ దశలో ఓటర్లకు నాకు ఓట్లు వేయకండి.. ప్లీజ్ నన్ను బయటకు పంపించండి అని అన్నాడు.

ఇక హౌస్ లో ప్రెజర్. తాను ఏం మాట్లాడినా.. దాన్ని స్ట్రాటజీ అంటూ నామినేట్ చేస్తున్నారు. ఎగతాళి చేస్తున్నారు. ఇవన్నీ మణికంఠపై దారుణమైన ప్రభావాన్ని పడేలా చేశాయి. దాంతో అతను అతనుబయటకు వెళ్లిపోవాలిఅనుకుంటున్నాడా అనేది అందరి డౌట్. ఇక మణికంఠని ఫేక్ ఎలిమినేష్ అనే అందరి భావన. అతను పక్కాగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి. మణికంఠ ఎంట్రీ ఉంటుందా.. ? లేక ఎలిమినేట్ అయ్యినట్టేనా అనేది. 
 

బిగ్ బాస్ హౌస్ లో  7వారం వీకెండ్.. సన్ డే ఫన్ డే.. ఎప్పటిలాగానే ఫన్ గేమ్స్ తో సరదా సరదాగా సాగిపోయింది. రకరకాల గేమ్ లు.. టాస్క్ లతో బిగ్ బాస్ హౌస్ లో సందడిగా మారింది. ఇక ఈసారి కాస్త ఫన్ లో డోస్ పెంచాడు బిగ్ బాస్. ఈ హౌస్ లో ఉన్నవారి గురించి బయట సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుంది, ఎవరెవరి మీద మీమ్స్ జరిగాయి. ఎమేమ్ మీమ్స్ వచ్చాయి అనేది ప్లే చేసి అందరిని నవ్వించారు. దాదాపు 10 మీమ్స్ దాకా చూపించగా.. అందులోఎక్కువగా మణికంఠ మీమ్స్ ఎక్కువగా ఉన్నాయి. 

ఇక ఫన్ టాస్క్ లతో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు హౌస్ మెట్. ట్యాగ్ లు వేస్తూ.. ఆడిన ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మణికంఠకు ఆడ్ని ఎవరికైనా చూపించండ్రా అనే ట్యాగ్ ఇచ్చింది హరితేజ, ప్రేరణకు నువ్వు ఊరుకోమ్మ ఊరికే తుతుతు అంటావు అనే ట్యాగ్ ఇచ్చాడు నిఖిల్, గంగవ్వకు.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అనే టాస్క్ ఇచ్చింది విష్ణుప్రియ. ఇలా ఫన్నీట్యాగ్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు. 

Latest Videos

click me!