ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా మూవీ అమరన్. బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది,
అక్టోబర్ 31న దివాళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న ఈమూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే అమరన్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.
ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటిస్తున్నారు. తాజాగా చెన్నై వేదికగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక్లో హీరో శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
Also Read: ఒక్క రాత్రికే 70,000 ఖర్చుపెట్టిన పూజా హెగ్డే