కోపంలో బాక్సులు పగలగొట్టిన మణిశర్మ.. థమన్‌ అబద్దం చెప్పాడా?.. స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అంత మాట అనేశాడేంటి?

Published : Feb 07, 2024, 10:33 PM IST

మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌పై మణిశర్మ హాట్‌ కామెంట్‌ చేశారు. బాక్సులు పగల కొట్టిన విషయం అబద్దం చెప్పాదంటూ సింగింగ్‌ షోలో రచ్చ చేశాడు మణిశర్మ. 

PREV
16
కోపంలో బాక్సులు పగలగొట్టిన మణిశర్మ.. థమన్‌ అబద్దం చెప్పాడా?.. స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అంత మాట అనేశాడేంటి?

నిన్నటి తరం మ్యూజిక్‌ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటారు మణిశర్మ. దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ని ఏలాడు. తాను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని ప్రత్యేకంగా గౌరవించుకుని సత్కరించుకుంది `స్టార్‌ మా`. ఇందులో ప్రసారం అయ్యే పాటల కార్యక్రమంలో ఆయన గెస్ట్ గా పాల్గొన్నారు. ఇందులో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. 
 

26

30ఏళ్ల సుధీర్ఘ ప్రస్తానంలో ఎన్నో మైలురాయి లాంటి పాటలు అందించారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ. ఆయన అనేక క్లాసికల్స్ అందించారు. మాస్‌ సాంగ్స్ ఇచ్చారు. మెలోడీస్‌ ఇచ్చారు. అద్భుతమైన ట్యూన్‌, అంతే అద్భుతమైన గాత్రానికి జోడించి ఆయన చేసిన మ్యాజిక్‌ సినిమా సక్సెస్‌లో కీలక భూమిక పోషించాయి. ఆయన ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో `స్టార్‌ మా`లో ప్రసారమయ్యే `సూపర్‌ సింగర్‌` కార్యక్రమంలో ఆయన్ని ప్రత్యేకంగా సత్కరించడం విశేషం. దీనికి ఆనంత శ్రీరామ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మంగ్లీ, శ్వేత మోహన్‌ జడ్జ్ లుగా ఉన్నారు. శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. 
 

36

దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో పలు ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చాలా వరకు సీరియస్‌గా ఉండే మణిశర్మ ఇందులో తనలోని ఫన్నీ యాంగిల్‌ని బయటపెట్టారు. నవ్వులు పూయించారు. అయితే ఇందులో థమన్‌ ప్రస్తావన వచ్చింది. థమన్‌.. మ్యూజిక్ అందిస్తే ఇటీవల థియేటర్లలో బాక్సులు పగిలిపోతున్నాయి. దీంతో పాట నచ్చకపోతే మీరు కూడా బాక్సులు పగలకొట్టారు కదా అని అడిగాడు అనంత శ్రీరామ్‌. 

46

దీనికి మణిశర్మ కాస్త సీరియస్‌గా, ఇంకాస్త ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. `అది ఆ థమన్‌ గాడు అబద్దం చెప్పాడు. అలా చేయలేదని చెప్పాడు. అయితే ఒక్కసారి మాత్రం పగలగొట్టాను అని నెమ్మదిగా చెప్పడంతో షోలో నవ్వులు విరిసాయి. మణిశర్మని డాన్సు చేయాలని అడగ్గా మొదట ఆయన నేను ఆడించేవాడినే కానీ, ఆడేవాడిని కాదన్నాడు. శ్రీముఖి పట్టుపట్టడంతో స్టేజ్‌పైకి వచ్చి డాన్సు స్టెప్పులేశాడు. 
 

56

మరోవైపు రాహుల్‌ సింప్లిగంజ్‌ తనతో ఈ పాడించలేదు ఎందుకని అడగ్గా, తనకు సినిమా అంటే రెస్పాన్సిబులిటీ ఉంటుందని పంచ్‌లు విసిరాడు. దానికి రాహుల్‌ సెట్‌ కాదనే విషయాన్ని ఆయన ఇలా చెప్పాడు. దీంతో నవ్వులు పూసాయి. ఇలా మధ్య మధ్యలో మణిశర్మ తనదైన పంచ్‌లతో నవ్వించారు. ఎంటర్‌టైన్‌ చేశారు.  సింగర్స్ మణిశర్మ స్పెషల్స్ పాడుతూ ఆయన్ని అలరించారు. వారికి ఆయన కూడా ఫిదా అయ్యాడు.

66

మరోవైపు మణిశర్మకి బాలకృష్ణ, రామజోగయ్య శాస్త్రి, పూరీ జగన్నాథ్‌, గుణశేఖర్‌ వంటి దర్శకులు ఆయన్ని కీర్తిస్తూఅభినందనలు తెలిపారు. ఇలాంటి పెద్ద స్టార్స్ తనకు అవకాశాలు ఇవ్వడం తన అదృష్టమని చెప్పాడు మణిశర్మ.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories