Mukku Avinash :బిడ్డని కోల్పోయిన క్షణంలో ముక్కు అవినాష్ ఆవేదన..మాట్లాడలేనని చెప్పినా కాల్స్ చేశారు

First Published | Feb 7, 2024, 5:19 PM IST

తన బిడ్డని కోల్పోయినప్పుడు మానసిక వేదన ఎలా ఉండేదో తొలిసారి ముక్కు అవినాష్ వివరించారు. తాము ఒకటి అనుకుంటే భగవంతుడు మరోలా రాసిపెట్టాడు అని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ముక్కు అవినాష్ కి జబర్దస్త్ షో గుర్తింపు తీసుకువచ్చింది. అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్ లో మరింత బిజీ అయ్యాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు. జబర్దస్త్ ఆఫర్స్ రాకముందు, కోవిడ్ సమయంలో అవినాష్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడట. అయితే శ్రీముఖి, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు సహాయం చేయడంతో బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు.   

అవినాష్ భార్య పేరు అనూజ. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే గత ఏడాది అవినాష్, అనూజ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సంతోషంగా ప్రకటించారు.సీమంతం, మెటర్నిటీ ఫోటో షూట్స్ కూడా చాలా గ్రాండ్ గా జరిగాయి. 


కానీ ముక్కు అవినాష్ కి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే తన భార్య బిడ్డకి జన్మనివ్వబోతోంది అనే సంతోషంలో ఉండగా విషాదం జరిగింది. గర్భంలోనే శిశువు మరణించింది. దీనితో ముక్కు అవినాష్ కుటుంబంలో తీరని ఆవేదన మిగిలింది. తన బిడ్డని కోల్పోయినప్పుడు ముక్కు అవినాష్   ఎంతటి ఆవేదన అనుభవించాడో తొలిసారి తెలిపాడు. 

ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. నా బిడ్డ మరణించినప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్నేహితులు కాల్స్ చేశారు. కానీ నేను మాట్లాడే స్థితిలో లేను. నా జీవితంలో కరిగిపోయిన మేఘం లాంటి సంఘటన అది. మేము ఒక విధంగా అనుకునే దేవుడు మరోలా రాసిపెట్టాడు. భవిష్యత్తులో మాకు ఏదైనా బెస్ట్ జరుగుతుందేమో అనే ఆశాభావంతో ఉన్నట్లు అవినాష్ పేర్కొన్నాడు. 

ఎవరూ ఏమీ అడగవద్దు అని చెప్పా, కానీ నా మీద అభిమానంతో, మానవత్వంతో చాలా మంది కాల్స్ చేశారు. వారందరి కేరింగ్ కి రుణపడి ఉంటాను. మా మీద అంత ప్రేమ చూపించిన వారందరికీ ధన్యవాదాలు అని ముక్కు అవినాష్ తెలిపారు. 

అవినాష్ అంతటి బాధని కూడా మనసులోనే దాచుకుని అందరిని నవ్వించేలా షోలలో పాల్గొన్నాడు. టివి కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. ముక్కు అవినాష్ కి శ్రీముఖి బాగా క్లోజ్. అవినాష్ కి ఆమె ఆర్థికంగా సహాయం కూడా చేసింది. శ్రీముఖితో కలసి బుల్లితెరపై అవినాష్ నవ్వులు పూయిస్తున్నాడు. 

Latest Videos

click me!