తాజాగా ఆమె గ్లామర్ గురించి అసభ్యంగా ప్రస్తావిస్తూ కండోమ్ సంస్థ అధినేత వివాదంలో చిక్కుకున్నారు. మాన్ ఫోర్స్ సంస్థ ఫౌండర్ రాజీవ్ జునేజా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ గురించి కామెంట్స్ చేశారు. కండోమ్ బ్రాండ్స్ కి సినీ తారలు, మోడల్స్ యాడ్స్ చేయడం సహజమే. కానీ రాజీవ్.. జాన్వీ కపూర్ అనుమతి లేకుండా ఆమె పేరు ప్రస్తావించారు. తమ బ్రాండ్ కండోమ్స్ యాడ్ కి జాన్వీ కపూర్ బెస్ట్ ఛాయిస్ అని రాజీవ్ పేర్కొన్నారు. అదే విధంగా రణబీర్ కపూర్ కూడా అని తెలిపారు.