'మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ పాకిస్థాన్' అన్నందుకు సింగర్ కు లీగల్ నోటీసులు

Published : Jan 30, 2025, 11:40 AM IST

మహాత్మా గాంధీని పాకిస్తాన్ జాతిపిత అని పిలిచినందుకు గాయకుడు అభిజీత్ భట్టాచార్యకు లీగల్ నోటీసు అందింది. గాంధీ, భారతదేశంపై అవహేళనకర వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని న్యాయవాది డిమాండ్ చేశారు.

PREV
14
  'మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ పాకిస్థాన్' అన్నందుకు సింగర్ కు  లీగల్ నోటీసులు
Activist, FIR, Abhijeet Bhattacharya, Mahatma Gandhi


మహాత్మా గాంధీని పాకిస్థాన్‌కు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలిచిం సింగర్ అభిజీత్ భట్టాచార్య వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనకు పూణేకు చెందిన న్యాయవాది అసిమ్ సోర్డే లీగల్ నోటీసు పంపారు. తన క్లయింట్ మనీష్ దేశ్‌పాండే తరపున పంపిన ఈ నోటీసుల్లో భట్టాచార్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోతే, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఆ లీగల్ నోటీసుల్లో తెలిపారు. 

24


అలాగే గత నెలలో సంగీత స్వరకర్త ఆర్‌డి బర్మన్ మహాత్మా గాంధీ కంటే పెద్దవాడని, కరంచంద్ గాంధీ పాకిస్తాన్‌కు ‘జాతి పితామహుడు’ భారతదేశానికి కాదు అని అభిజిత్ భట్టాచార్య చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. భారత్ ఎప్పటి నుంచో ఉంది.. పాకిస్తాన్ మాత్రం భారతదేశం నుంచి ఉద్భవించింది అన్నాడు. 
 

34

గాంధీని భారతదేశానికి జాతిపిత అని పొరపాటుగా పిలిచారు అని పేర్కొన్నాడు. దీంతో, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా “మహాత్మా గాంధీకి చెందిన దేశం”గా గుర్తించబడిందని గాయకుడు భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు మహాత్మా గాంధీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని తన లీగల్ నోటీసులో న్యాయవాది అసిమ్ సోర్డే పేర్కొన్నారు. 

44


ఈ క్రమంలో  భారతదేశం ఎప్పుడూ ఉనికిలో ఉంది.. పాకిస్థాన్ పొరపాటున సృష్టించబడిందని సింగర్ అభిజిత్ భట్టాచార్య మూర్ఖపు ప్రకటన చేశారని మనీష్ తరపు అడ్వకేట్ అసిమ్ సోర్డే పేర్కొన్నారు. ఈ ప్రకటన మహాత్మా గాంధీ జీ పట్ల మీ మనస్సులో ద్వేషాన్ని చూపిస్తుంది అని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తక్షణమే భట్టాచార్య క్షమాపణలు చెప్పాలి, లేకపోతే అతనిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 353 (పబ్లిక్ దుర్మార్గం), సెక్షన్ 356 (పరువు నష్టం) కింద ఫిర్యాదు చేస్తామని నోటీసులో సోర్డే వెల్లడించారు. 
 

click me!

Recommended Stories