తెలుగు హీరో తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ నటించిన మూవీ `మండాడి`. సూరి హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. పోటీగా వచ్చిన హీరోలకు చుక్కలు చూపిస్తోంది.
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ‘మండాడి’ మూవీ రూపొందింది. ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేసింది. సెప్టెంబర్ 10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. సంచలన వసూళ్లని రాబడుతోంది.
24
బండాడి ఆరు రోజుల కలెక్షన్లు
`మండాడి` మూవీకి మొదట మిశ్రమ స్పందన లభించింది. యావరేజ్ నుంచి, ఎబౌ యావరేజ్‌గా వినిపించింది. కానీ నెమ్మదిగా పుంజుకుంది. రెండో రోజు నుంచే జోరు చూపించింది. అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రానికి ఆరో రోజు రూ.4.40కోట్లు రాబట్టింది. వీక్ డేస్‌లో ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషం. ఓవర్సీస్‌లో ఆరో రోజు కోటిన్నర వచ్చింది. అక్కడ మొత్తంగా రూ.10.65కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.69.43కోట్లు రావడం విశేషం. ఇండియాలో దీనికి రూ.58.78కోట్ల గ్రాస్ వచ్చింది.
34
బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి మండాడి
అయితే ఐదో రోజు సోమవారం దీనికి రూ.11.25కోట్ల కలెక్షన్లు రాగా, మంగళవారం భారీగా పడిపోయింది. సుమారు అరవై శాతం పడిపోవడం గమనార్హం. ఇది పెద్ద డ్రాప్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.60కోట్లు అని సమాచారం. సుమారు 70కోట్లు అయ్యిందని సూరి ఆ మధ్య ఓ ఈవెంట్‌లో తెలిపారు. ఇక సినిమాకి అయిన థియేట్రికల్ బిజినెస్ రూ.25కోట్లు. దాదాపు రూ.27కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేటర్‌లో విడుదలైంది. ఇప్పుడు ఆల్‌రెడీ బ్రేక్ ఈవెన్ దాటేసింది. దీనికి సుమారు రూ.35కోట్ల షేర్ రావడం విశేషం. అంటే ఇది పది కోట్ల లాభాల్లోకి వెళ్లింది. ఇప్పుడు వంద కోట్ల దిశగా వెళ్తోంది. సుహస్, సూరిల సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదు. కంటెంట్ ఉంటే ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపితమైంది.
అంతేకాదు ఓటీటీ రూపంలోనూ అదిరిపోయే డీల్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ దీనికి రూ.40కోట్లు ఇచ్చి కొనుగోలు చేసిందట. మొదట పది కోట్లకు రిజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు అదే ఎక్స్ ట్రా రూ.30కోట్లు చెల్లించి కొనడం విశేషం. గత వారం విడుదలైన చిత్రాల్లో `మండాది`నే బాక్సాఫీసుని షేక్ చేస్తోంది. సుహస్, సూరి కలిసి.. ఆనంద్ దేవరకొండ(ఎపిక్), సుమంత్(మహేంద్రగిరి), కార్తి(సర్దార్ 2) సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు. `మండాడి`తో పోటీలో వారి సినిమాలు డీలా పడ్డాయి. డిజాస్టర్లుగా నిలుస్తుండటం గమనార్హం.