ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి ది బెస్ట్ మూవీ అందులో డౌట్ లేదు. నాతో పాటు అందరికి ఆ మూవీ అంటే చాలా ఇష్టం. కానీ చిరంజీవి, కె విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలంటే పిచ్చి. ఆ మూవీస్ ఏదో ఒకటి రీమేక్ చేయాలని ఉన్నట్లు విష్ణు పేర్కొన్నారు. విశ్వనాథ్, చిరు కాంబోలో స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి చిత్రాలు వచ్చాయి. విష్ణు అన్నీ క్లాసిక్ చిత్రాల పేర్లు చెప్పారు. మరి ఆ చిత్రాలని రీమేక్ చేసి ఆ స్థాయిలో మెప్పించడం అంటే మామూలు సాహసం కాదు.