ఎన్టీఆర్ కి ఇష్టమైన విలన్ ఎవరో తెలుసా, ఎస్వీఆర్ కాదు..ఆయన లేకుంటే షూటింగ్ క్యాన్సిల్ అని షాకిచ్చిన పెద్దాయన

Published : Mar 20, 2025, 05:22 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆర్టిస్టులతో ఎస్వీ రంగారావు ఒకరు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఎస్వీఆర్ శైలి. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. 

PREV
15
ఎన్టీఆర్ కి ఇష్టమైన విలన్ ఎవరో తెలుసా, ఎస్వీఆర్ కాదు..ఆయన లేకుంటే షూటింగ్ క్యాన్సిల్ అని షాకిచ్చిన పెద్దాయన

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆర్టిస్టులతో ఎస్వీ రంగారావు ఒకరు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఎస్వీఆర్ శైలి. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ చిత్రాల్లో ఎస్వీఆర్ విలన్ గా కూడా నటించారు. ఎన్టీఆర్ కి సరిపడే విలన్ ఆయన. 

 

25
Sr NTR

ఎన్టీఆర్ ఎదురుగా విలన్ గా నటించి మెప్పించాలంటే అంత సులువైన విషయం కాదు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అప్పుడప్పుడే తాము ఇండస్ట్రీలో రచయితలుగా ఎదుగుతున్నాం. ఆ టైంలో ఎన్టీఆర్ నటిస్తున్న నా దేశం చిత్రానికి కూడా మేమే రచయితలం అని పరుచూరి తెలిపారు. 

 

35

ఫస్ట్ హాఫ్ కథ మొత్తం బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వరకు ఫైట్ లేదు. కథ మధ్యలో ఫైట్ యాడ్ చేస్తే ఎన్టీఆర్ గారు తిడతారేమోనని ఆ చిత్ర నిర్మాత దేవి వరప్రసాద్ భయపడ్డారు. ఆ చిత్ర షూటింగ్ ఊటీలో జరుగుతోంది. సెకండ్ హాఫ్ లో ఫైట్ గురించి దేవి వరప్రసాద్ ఎన్టీఆర్ ని అడగమని పరుచూరికి చెప్పారట. పరుచూరి వెళ్లి.. అన్నగారు ఈ విధంగా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వరకు ఫైట్ లేదు. మధ్యలో ఒక ఫైట్ ఉంటే బావుంటుంది అని చెప్పారట. ఎన్టీఆర్ వెంటనే ఒకే చెప్పి ప్లాన్ చేసుకోండి అని అన్నారు. 

 

45

ఆ మూవీలో కైకాల సత్యనారాయణ విలన్ గా నటిస్తున్నారు. కానీ ఫైట్ సన్నివేశం ఏమో సాధారణ ఆర్టిస్టులతో ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ వెంటనే వాళ్ళని చూసి అదేమిటి వీళ్ళతో మేము ఫైట్ చేయాలా ? మేము కన్నెర్ర చేస్తేనే వాళ్ళు గుండె ఆగి చనిపోతారు. నా స్థాయికి సరిపోరు. నాకు ఇష్టమైన సత్యనారాయణతో ఫైట్ పెట్టండి లేకుంటే షూటింగ్ క్యాన్సిల్ అని షాకిచ్చారట. 

 

55

చాలా చిత్రాల్లో కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ కి విలన్ గా నటించారు. ఎన్టీఆర్ తో ఫైట్ చేస్తున్న సమయంలో కొన్నిసార్లు ఆయన నిజంగానే కొట్టేవారని.. వేరే వాళ్ళు అయితే చనిపోయి ఉంటారని సత్యనారాయణ కూడా ఓ ఇంటర్వ్యూలో సరదాగా గుర్తు చేసుకున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories