`పుష్ప2` కారణంగానే `కన్నప్ప` వాయిదా పడిందా? మంచు విష్ణు ఏం చెప్పాడంటే? అసలు కారణమిదే?

First Published | Nov 29, 2024, 8:30 PM IST

మంచు విష్ణు ప్రస్తుతం `కన్నప్ప` సినిమాలో నటిస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్‌ వాయిదాపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. 
 

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మూవీ `కన్నప్ప`. తండ్రి మంచు మోహన్‌బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. సుమారు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో భారీ కాస్టింగ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఇందులో ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ రకంగా వారివి గెస్ట్ రోల్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అయితే మైథలాజికల్‌ అంశాలతో రూపొందుతున్న ఈ మూవీకి ముకేష్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప పాత్ర ప్రధానంగా సినిమా తెరకెక్కుతుంది. ఇందులో శివుడు, పార్వతి పాత్రలకు ప్రయారిటీ ఉంటుంది. అలాగే మరికొన్ని కీలక పాత్రలు ఉన్నాయి. వాటిలో ప్రభాస్‌, మోహన్‌బాబు, మోహన్‌లాల్‌ నటిస్తున్నారు. శివుడిగా అక్షయ్‌ కుమార్‌, పార్వతిగా కాజల్‌ నటిస్తున్నారు. ప్రభాస్‌ పాత్రేంటో తెలియాల్సి ఉంది. అది సస్పెన్స్ లో పెట్టింది టీమ్‌. 
 


ఇదిలా ఉంటే ఈ మూవీ డిసెంబర్‌లో విడుదలవుతుందనే ప్రచారంజరిగింది. అప్పట్లో టీమ్‌ నుంచి కూడా ఇలాంటి సమాచారమే వచ్చింది. కానీ ఇటీవల కొత్త డేట్‌ని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో `పుష్ప2`తో పోటీ కారణంగా డిసెంబర్‌ నుంచి తప్పుకుందనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై హీరో మంచు విష్ణు స్పందించారు. సినిమా షూటింగ్‌ పూర్తి కాలేదన్నారు. విదేశాల్లో కొన్ని సీక్వెన్స్ జరుగుతున్నాయని, అవి డిసెంబర్‌ ఎండింగ్‌కి పూర్తవుతుందని, దీంతోపాటు హైదరాబాద్‌లో పలు స్టూడియోస్‌లో వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతుందన్నారు. 
 

వీఎఫ్‌ఎక్స్ కి సంబంధించి తాను చాలా నేర్చుకుంటుందని, అది చాలా పెద్ద విషయం, దానికి టైమ్‌ పడుతుందని, అందుకే సినిమా డిలే అవుతుందని తెలిపారు మంచు విష్ణు. అంతేకాదు సినిమా వాయిదాకి మరో కారణం కూడా చెప్పారు. తమ `కన్నప్ప` సినిమాని, పుష్ప 2` ని రిలీజ్‌ చేస్తున్నది సేమ్‌ డిస్ట్రిబ్యూటర్లు అని, అది కూడా ఓ కారణమన్నారు. అయితే మంచి సినిమా ఎప్పుడు వచ్చినా చూస్తారని తెలిపారు మంచు విష్ణు. 

read more:సమంత తండ్రి తెలుగువారా? చెన్నై లో ఏం చేసేవారో తెలుసా? ఫ్యామిలీ డిటెయిల్స్

also read: ప్రభాస్‌ విలన్‌గా మారేలా చేసిన రాజమౌళి, కత్తి కోసం గొడవ.. డార్లింగ్‌ చేసిన పనికి జక్కన్నకి ఫ్యూజులు ఔట్‌
 

Latest Videos

click me!