నటి హేమ వివాదం.. ఇదేం లాజిక్ అంటూ మంచు విష్ణుపై దారుణంగా ట్రోలింగ్

First Published May 26, 2024, 9:35 AM IST

గత వారం రోజులుగా బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. బెంగుళూరులోని ఒక ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. పోలీసులు రైడ్ చేసి చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. 

గత వారం రోజులుగా బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. బెంగుళూరులోని ఒక ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. పోలీసులు రైడ్ చేసి చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి విచారిస్తున్నారు. 

ఈ కేసులో తెలుగు నటి హేమ పేరు కూడా బయటకి వచ్చింది. అలాగే యంగ్ బ్యూటీ ఆషి రాయ్ కూడా పోలీసులకు చిక్కింది. హేమని పార్టీలో గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ ఆమె పెద్ద డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. ఫామ్ హౌస్ లోనే ఉండి తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చెప్పడం మాత్రమే కాదు ఫోటో కూడా రిలీజ్ చేశారు. 

Hema

స్వయంగా బెంగుళూరు సిటీ కమిషనర్ నటి హేమ పార్టీలో ఉన్నట్లు నిర్ధారించారు. మరో సంచలన విషయం ఏంటంటే హేమ బ్లడ్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీనితో ఆమెకి మరింత చిక్కులు తప్పేలా లేవు. ఇంత తతంగం జరుగుతున్నా 'మా' అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించిన విధానం విమర్శలకు దారి తీస్తోంది. 

హేమపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆమెని సమర్ధించే ప్రయత్నం చేస్తున్నాడు. మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా హేమ గురించి చేసిన ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసులు సరైన ఆధారాలు సమర్పిస్తే అప్పుడు మా అసోసియేషన్ సరైన చర్చ తీసుకుంటుంది అని అర్థం వచ్చేలా మంచు మనోజ్ కామెంట్స్ చేశారు. అంటే మంచు విష్ణు.. బెంగుళూరు పోలీసులు ఆధారాలని మా అసోసియేషన్ కి సమర్పించాలని కోరుకుంటున్నారా ? అయితే ఇదేం లాజిక్ అంటూ విమర్శిస్తున్నారు. 

అసలు బెంగుళూరు పోలీసులు ఎవరికో ఎందుకు ఆధారాలు ఇస్తారు.. వాళ్ళు ఆధారాలు సమర్పించేది కోర్టులోనే. మంచు విష్ణు ఇలా ఎలా సమర్థించగలుగుతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. హేమ పార్టీకి వెళ్లడం, ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు వచ్చిన రిపోర్ట్ లు అన్నీ మీడియాలో వచ్చిన పుకార్లు మాత్రమే అన్నట్లుగా మంచు విష్ణు కొట్టిపారేసే ప్రయత్నం చేశాడు. 

పోలీసులు అన్నీ చెబుతున్నప్పటికీ..అప్పుడే ఆమెపై ఒక నిర్ధారణకు రావద్దు అంటూ మంచు విష్ణు కోరడం నెటిజన్లకు నచ్చడం లేదు. పైగా ఆమె మహిళ అనే సింపతిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ నెటిజన్లు అంటున్నారు. హేమ గురించి వస్తున్న వార్తలన్నీ నిరాధారమైతే..ఆమె ఇప్పటికే పరువు నష్టం కేసు వేయాలి కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా హేమ వ్యవహారం మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మెడకి కూడా చుట్టుకునట్లు ఉంది. 

click me!