నందమూరి ఫ్యామిలీకి రెండు హిట్లు ఇచ్చా, ఆ సినిమా వల్లే కనుమరుగు..హీరోని చులకనగా చూస్తూ హీరోయిన్ గొడవ

First Published May 26, 2024, 8:28 AM IST

హీరో నవదీప్ ఓ హీరోయిన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నవదీప్ 17 ఏళ్ళ వయసులోనే, తన రెండవ చిత్రానికే వార్తల్లోకి ఎక్కాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. అంకిత.

టాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య కూడా చాలా సందర్భాల్లో మనస్పర్థలు వస్తుంటాయి. మనస్పర్థలు ఏర్పడటానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ అలాంటి సంఘటనలు బయటపడకుండా రచ్చకెక్కకుండా మేనేజ్ చేసుకునే వారు ఉంటారు. కానీ హీరో నవదీప్ ఓ హీరోయిన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 

నవదీప్ 17 ఏళ్ళ వయసులోనే, తన రెండవ చిత్రానికే వార్తల్లోకి ఎక్కాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. అంకిత. సింహాద్రి చిత్రంతో అంకిత పేరు మారుమోగింది. అంకిత, నవదీప్ కలసి 2005లో మనసు మాట వినదు అనే చిత్రంలో నటించారు. ఇది నవదీప్ సెకండ్ ఫిలిం. 

అప్పటికే అంకిత సింహాద్రి, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. నవదీప్ తో నటించే సమయంలో ఊహించని విధంగా గొడవ మొదలయిందట. నందమూరి ఫ్యామిలీకి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చానని గర్వం ఆమెలో కనిపించిందని నవదీప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నా లాంటి చిన్న హీరో పక్కన నటించడం ఆమెకి నచ్చలేదు. 

దీనితో చులకనగా చూడడం ప్రారంభించింది. షూటింగ్ లో ఆమె చెప్పినట్లే జరగాలని బిహేవ్ చేసేది. ఆయా చిత్రానికి ఇవ్వాల్సిన డేట్స్ కంటే ఎక్కువే ఇచ్చిందనేది ఆమె ఫీలింగ్. చివరి రెండు సాంగ్స్ షూటింగ్ ఉంది. షూటింగ్ కోసం పిలిస్తే నేను రాను.. ఆల్రెడీ కావలసినన్ని డేట్లు ఇచ్చాను. నాకు వేరే మూవీ షూటింగ్ ఉందని చెప్పింది. కానీ బలవంతంగా ఒప్పించి తీసుకెళ్ళాం. 

చిన్న హీరో సినిమా కోసం ఇన్ని డేట్లు వేస్ట్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఆమెలో మొదలయింది. షూటింగ్ లో నాతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఏదో విధంగా గొడవ పెట్టుకుని షూటింగ్ ఆపేయాలనేది ఆమె ప్లాన్. నాతో గొడవ పెట్టుకోవడంతో.. నీ ప్రాబ్లమ్ ప్రొడ్యూసర్ తో నాతో కాదు.. నేను ఏమి చేశాను అని అడిగా. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఆల్ గుడ్ అనుకుంటున్న తరుణంలో మీడియాలో న్యూస్ వచ్చింది. 

నవదీప్.. అంకితని హెరాజ్ చేశాడు. దీనితో ఆమె నిద్ర మాత్రలు తీసుకుంది అంటూ మీడియాలో పుకార్లు వచ్చాయి. నా పేరుతో పెద్ద రచ్చే జరిగింది. ఆ సమయంలో మా ప్రెసిడెంట్ గా ఉన్న నాగబాబు గారు నాకు అండగా నిలిచారు అని నవదీప్ తెలిపాడు. ఈ సంఘటనపై అంకిత కూడా స్పందించింది. 

ఆ సమయంలో తనకి వేరే సినిమా షూటింగ్ కూడా ఉండటంతో విపరీతమైన ఒత్తిడిలో ఉన్నానని అంకిత తెలిపింది. నా సమస్య నవదీప్ తో కాదు.. ప్రొడ్యూసర్ తోనే అని క్లారిటీ ఇచ్చింది. అయితే నవదీప్ కూడా ఒత్తిడిలో కాస్త భిన్నంగా ప్రవర్తించాడు. ఆ సమస్య ముగిసిపోయింది అని ఇటీవల ఇంటర్వ్యూలో అంకిత పేర్కొంది. నవదీప్ తో నటించడం వల్లే మీరు ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారా అని ప్రశ్నించగా అంకిత ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 

నవదీప్ సినిమా వల్ల కాదు.. బాలయ్యతో నటించిన విజయేంద్ర వర్మ సినిమా వల్ల నేను ఇండస్ట్రీకి దూరం అయ్యా. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. విజయేంద్ర వర్మ లాంటి పెద్ద చిత్రం ఫ్లాప్ కావడంతో నాకు ఆఫర్స్ రాలేదు. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నా. కానీ నా ఆశలు ఫలించలేదు. ఈ మూవీ హిట్ అయి ఉంటే హీరోయిన్ గా కొనసాగేదాన్ని అని అంకిత పేర్కొంది. 

click me!