హీరో సుమంత్ కౌగిలిలో మంచు లక్ష్మి... అతిపెద్ద చర్చకు దారితీసిన రొమాంటిక్ ఫోటో!

Published : Feb 10, 2023, 01:27 PM IST

సోషల్ మీడియా యుగంలో నచ్చినట్లు ఉంటే కుదరదు. అలా చేస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదు. పాశ్చాత్య ధోరణి చూపిస్తూ మంచు లక్ష్మి ట్రోల్స్ కి గురవుతున్నారు. ఆమె లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చర్చకు దారితీసింది.   

PREV
16
హీరో సుమంత్ కౌగిలిలో మంచు లక్ష్మి... అతిపెద్ద చర్చకు దారితీసిన రొమాంటిక్ ఫోటో!
Manchu Lakshmi

మంచు లక్ష్మి అమెరికాలో చాలా కాలం ఉన్నారు. అక్కడ టెలివిజన్ హోస్ట్ గా షోలు చేశారు. కొన్ని సినిమాల్లో నటించారు. ఏళ్ల తరబడి అమెరికాలో ఉండటం వలన ఆమె  స్థానిక కల్చర్ కి అలవాటు పడ్డారు. ఆమె చర్యలు, చేష్టలు పాశ్చాత్య ధోరణి కలిగి ఉంటాయి. ఇక్కడ జనాలకు అది కొత్తగా తోయడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

26
Manchu Lakshmi

మంచు లక్ష్మి లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ట్రోల్ కి గురవుతుంది. జనాలను చిరాకు పెట్టిన ఆ పోస్ట్ లో ఏముందో చూద్దాం. ఫిబ్రవరి 9న నటుడు సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియా  వేదికగా బర్త్ డే విషెస్  తెలియజేశారు. సదరు పోస్ట్ కి సుమంత్ తో దిగిన ఫోటో జోడించారు. అయితే ఆ ఫోటో కొంచెం రొమాంటిక్ గా ఉంది. మంచు లక్ష్మి ని సుమంత్ హగ్ చేసుకున్నారు. 
 

36
Manchu Lakshmi


దీన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. పెళ్ళైన మహిళ అయ్యుండి ఒక మగాడితో ఇలాంటి ఫోజులా? తండ్రి మోహన్ బాబు నేర్పిన డిసిప్లైన్ ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఎఫైర్ అంటగడుతూ బూతు కామెంట్స్ చేస్తున్నారు. రిలేషన్ తో సంబంధం లేకుండా అబ్బాయి అమ్మాయి హగ్ చేసుకుంటే ఇండియన్ సొసైటీ తప్పుగానే చూస్తుంది. 

46

మంచు లక్ష్మి ట్విట్టర్ పోస్ట్ విపరీతమైన ట్రోల్స్ కి గురవుతుంది. మరీ తిట్టిపోయాల్సినంత తప్పు ఆ ఫొటోలో లేదు కానీ..  మన సొసైటీని దృష్టిలో ఉంచుకొని పోస్ట్స్ పెడితే బాగుంటుంది. నేను అమెరికాలో పెరిగాను, అక్కడ ఇదంతా కామన్ అన్నట్లు మాట్లాడితే ఇలానే విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ట్రోల్, కామెంట్స్ మంచు లక్ష్మికి అలవాటైపోయాయి. ఆమె పెద్దగా పట్టించుకోరు కూడాను. 

56


ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కుతుంది. సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి నిర్మించి నటిస్తున్నారు. ఇటీవల మంచు లక్ష్మి మాన్స్టర్ అనే మలయాళ చిత్రంలో నటించారు. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. 

66


మంచు లక్ష్మి అల్ట్రా మోడరన్ వుమన్ చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. హీరోయిన్ రేంజ్ లో ఫోటో షూట్స్ లో పాల్గొంటారు. హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నం చేసిన మంచు లక్ష్మి ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories