కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’రివ్యూ

First Published | Feb 10, 2023, 12:52 PM IST

 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావడంతో 'అమిగోస్' మీద అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకున్నాడా....  మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ ఎలా చేశారు? సినిమా ఎలా ఉంది ?

Amigos Review


రొటీన్ లో కొట్టుకుపోకుండా విభిన్నమైన చిత్రాలు చేస్తాడు అని కళ్యాణ్ రామ్ పై సినీ ప్రేమికులకు ఓ నమ్మకం. రీసెంట్ గా వచ్చిన బింబిసార చిత్రం కూడా అది ప్రూవ్ చేసింది సక్సెస్ అయ్యింది. తాజాగా  డాపుల్ గ్యాంగర్స్ (మనిషిని పోలిన మనుషులు) స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన అమిగోస్‌పై పాజిటివ్ బజ్ ఉంది. కొత్తగా అనిపించే పాయింట్ తో వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ బాగా క్లిక్ అయ్యింది. అయితే బింబిసార సినిమా తర్వాత వస్తున్న చిత్రంకు రావాల్సిన స్దాయిలో బజ్ అయితే క్రియేట్ కాలేదు. ఈ క్రమంలో సినిమా బాగుంటే మౌత్ టాక్ తో వర్కవుట్ అవ్వాలి. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించటానికి బాగా కష్టపడ్డాడని అర్దమవుతోంది. మరి   డాపుల్ గ్యాంగర్స్ భాక్సాఫీస్ దగ్గర ఏమన్నా సెన్సేషన్ క్రియేట్ చేస్తాయా...చిత్రం కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Amigos Review


కథాంశం:

ఇది ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు సిద్ధార్థ్‌(కల్యాణ్‌ రామ్‌), మంజునాథ్‌(కల్యాణ్‌ రామ్‌) ,  మైఖేల్(కల్యాణ్‌ రామ్‌) కథ. వీరు చూడటానికి ఒకేలా ఉన్నా...ఆలోచన విధానంలో పూర్తి విరుధ్దమైన వాళ్లు.  వీళ్లలో సిద్ధార్థ్‌(కల్యాణ్‌ రామ్‌)..ఓ బిజినెస్ మ్యాన్.  అతను పద్దతైన వాడు,తెలివైన వాడు.  ఆర్జేగా పనిచేసే ఇషిక(ఆషికా రంగనాథ్‌) తో ప్రేమలో ఉంటాడు. ఆమె ఒప్పించునే పనిలో ఉంటాడు. ఇక బెంగళూరుకు చెందిన మంజునాథ్‌(కల్యాణ్‌ రామ్‌) ఓ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇతను కూడా సాప్ట్ మెంటాలిటీ.ఇక మూడో వాడు కలకత్తాకు చెందిన  బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్ (కల్యాణ్‌ రామ్‌) ఓ  మోస్ట్ వాటెండ్ క్రిమినల్. ఇక సిద్దార్ద చొరవతో ఈ ముగ్గురూ డోపెల్‌గ్యాంగర్ అనే వెబ్ సైట్ ద్వారా ఒకరికొకరు పరిచయం చేసుకుని గోవాలో కలుస్తారు. ప్రెండ్స్ అయ్యి బాగా క్లోజ్ మారతారు. అయితే మైఖేల్ అసలు ఎవరనే విషయం మిగతా ఇద్దరికీ తెలియదు. 


Amigos Review


ఇక మైఖేల్ వీళ్లను కలవటానికి ముందే ఓ ఎన్ ఐ ఏ ఆఫీసర్ ని చంపేస్తాడు.అతన్ని పట్టుకునే పనిలో  ఉంటారు ఎన్ఐఏ టీమ్ అఫీషియల్స్. వారి నుంచి తప్పించుకోవడం కోసం.. బిపిన్ రాయ్.. మైఖేల్‌గా మారి సిద్దార్ధ్, మంజునాథ్‌లను ఇరికిస్తాడు.  అంతేకాదు సిద్దూ స్థానంలోకి వచ్చి మైఖేల్ అతని  ఇంట్లో, జీవితంలో ప్రవేశిస్తాడు.   ఇషికను సైతం ట్రాప్ చేయబోతాడు. అప్పుడు  ఎన్‌ఐఏ అధికారులు ఎవరిని అరెస్ట్‌ చేశారు?  ఫైనల్ గా వీళ్లద్దరినీ చంపేసి విదేశాలకు పారిపోదామనుకన్న  బిపిన్‌ రాయ్‌ నుంచి ఎలా తప్పించుకున్నారు..ఇషిక ను ఎలా రక్షించుకున్నారు... ఫైనల్ గా ఏమైంది అనేదే   మిగిలిన ‘అమిగోస్’ కథ. 

Amigos Review

విశ్లేషణ:

ఐడియా లెవిల్ లో Face/Off (1997)స్దాయిలో ఉన్న మంచి కాంప్లిక్ట్స్ ఉన్న కాన్సెప్టు  ఇది. అయితే దాని విస్తరణ మాత్రం అనుకున్న స్దాయిలో జరగలేదు. దాంతో  పరుగెత్తాల్సిన కథ చాలా చోట్ల నత్త నడక నడిచింది. ఎంతసేపు చూసినా ఏమీ జరిగినట్లు అనిపించదు. అలాగే ట్రైలర్ లోనే మనకు చాలా భాగం అర్దమవుతుంది కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే  చూడాలని ఆశిస్తాం. అయితే ట్రైలర్ లో చెప్పిన విషయం చెప్పటానికి ఫస్టాఫ్ మొత్తం తీసుకున్నారు. దాంతో చాలా ప్రెడిక్టబుల్ గా కథ ,కథనం జరుగుతున్నట్లుంది. అంటే కొత్త పాయింట్ చూస్తున్నా..కొత్తగా అనిపించదు. ఇక సిద్దు, ఇషిక లవ్ ట్రాక్ సాదా సీదాగా నడుస్తూంటుంది.  'అమిగోస్'లో ఎంగేజ్ చేస్తూ, క్యూరియాసిటీ కలిగింటంలో తడబడ్డారు.ఇంట్రస్టింగ్ ఐడియా, సెటప్ ఉన్నా వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. కొత్త ట్విస్ట్ లు, కథను పరుగెత్తించే సంఘటనలు పెద్దగా కనపడలేదు. సాదా సీదా స్క్రీన్ ప్లే ని ఇలాంటి ఇంట్రస్టింగ్ కు ఐడియాకు రాసుకోవటమే ఇబ్బంది పెట్టింది. ఇంటర్వెల్ వచ్చేదాకా ఫస్టాఫ్ లాగుతున్న ఫీలింగ్ వస్తుంది. సెకండాఫ్ ఉన్నంతలో బాగుంది కానీ అద్బితమైతే కాదు. సినిమా లేపి కూర్చో బెట్టేక్లైమాక్స్ లేదు. అదీ అర్దమైపోతుంది. ఏదైమైనా వావ్ మూమెంట్స్ అతి తక్కువగా ఉన్న స్క్రిప్టు ఇది. 

Amigos Review

టెక్నికల్ గా ...

ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలోనే ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే మొదటి సారి దర్శకత్వానికి మరింత కలిసి వచ్చేది. అయితే దర్శకుడుగా మూడు వేరియేషన్స్ కళ్యాణ్ రామ్ నుంచి రాబట్టుకోవటంతో  సక్సెస్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్  ప్లాట్ గా ఉంది. ఇలాంటి థ్రిల్లర్  కథలకు మరింత హాంట్ చేసేలా బాగుండాలి. పాటలు జస్ట్ ఓకే. ‘ఎన్నోరాత్రులు వస్తాయి కానీ..’  రీమిక్స్ సాంగ్  సినిమాలో అప్పటి వింటేజ్  ప్లేవర్ ని రిపీట్ చేయలేదు. వాటి ప్లేస్ మెంట్ కూడా విసిగించింది. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. అవుట్ స్టాండింగ్ అనిపిస్తుంది కొన్ని చోట్ల. మైత్రీ వారి ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడేదేమీ లేదు. ఓ స్టాండర్డ్స్ లో మెయింటైన్ చేస్తున్నారు. ఎడిటింగ్ కూడా ఇంకాస్త గ్రిప్పింగ్ గా చేసి ఉంటే ..సెకండాఫ్ లాగ్ అని కొన్ని చోట్ల అనిపించకపోవును. డైలాగులు కొన్ని చోట్ల సహజంగా సినిమాలో కలిసి పోయి బాగున్నాయి.


Performance: 

కళ్యాణ్ రామ్ ..సినిమా సినిమాకూ తనలోని నటుడుని ఉత్తేజపరుస్తున్నారు. ముగ్గురు విభిన్నమైన వ్యక్తులుగా కళ్యాణ్ రామ్ బాగా చేసారు. ఈ సినిమాతోనే పరిచయం అయిన అషికా రంగనాధ్ చూడానిటి  స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బ్రహ్మాజీ, సప్తగిరి వంటి సీజన్ ఆర్టిస్ట్ అలా చేసుకుంటూ పోయారు. 
  


నచ్చినవి

  డోపెల్‌గ్యాంగర్  ఇనే కొత్త ఐడియా
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
కళ్యాణ్ రామ్ మేకోవర్
సినిమాటోగ్రఫీ

నచ్చనవి

కోర్ పాయింట్ తప్ప మిగతావేమీ ఇంట్రస్టింగ్ గా లేకపోవటం
థ్రిల్స్, హైస్ లేకపోవటం
జస్ట్ ఓకే అనిపించే లవ్ ట్రాక్


ఫైనల్ థాట్

కొత్తదనం 'ఐడియా' లెవిల్ లోనే  ఆగిపోతే..జనాలు థియేటర్ గుమ్మాలు దగ్గరే ఆగి ఆలోచనలో పడతారు

---సూర్య ప్రకాష్ జోశ్యుల


Rating:2.5

Amigos Review


 బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
 నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, అషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్: జిబ్రాన్ 
సినిమాటోగ్రఫి: సౌందరరాజన్ 
ఎడిటింగ్: తమ్మిరాజు 
 రచన, దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి 
నిర్మాతలు: వై రవిశంకర్, నవీన్ ఎర్నేని 
 రిలీజ్ డేట్: 2023-02-10

Latest Videos

click me!