Manchu Vishnu: బాలయ్య, మోహన్ బాబు ముందే మంచు విష్ణు నిజస్వరూపం బయటపెట్టిన మంచు లక్ష్మి.. ఇలా చేస్తాడా?

Published : Jul 03, 2026, 09:11 PM IST

Manchu Vishnu: మంచు విష్ణు రియాలిటీ గురించి ఓపెన్‌ అయ్యింది మంచు లక్ష్మి. బాలకృష్ణ, మోహన్‌బాబు ముందే ఆయనేంటో వెల్లడించింది. షాకింగ్‌ నిజాన్ని బయటపెట్టింది. 

PREV
14
మంచు వారి గొడవలకు తాత్కాలిక బ్రేక్‌

మంచు మోహన్‌ బాబు ఫ్యామిలీ వివాదం ఆ మధ్య పెద్ద ఇష్యూ అయిన విషయం తెలిసిందే. ఆస్తుల విషయంలో గొడవలు జరిగినట్టు సమాచారం. కానీ కాలేజీలో స్కామ్‌ జరుగుతుందంటూ మంచు మనోజ్ ఆరోపణలు చేశారు. ఏకంగా సీఎంను కలిసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పుడు ఆ గొడవలు సర్దుమనిగినట్టు తెలిపారు. ఆ మధ్య మరోసారి మంచు మనోజ్‌ స్పందిస్తూ ఈ వివాదం గురించి మోహన్‌బాబు, విష్ణునే అడగాలని చెప్పడం గమనార్హం. 

24
మంచు విష్ణు గురించి షాకింగ్ విషయం చెప్పిన లక్ష్మి

ఈ క్రమలో ఇప్పుడు మంచు విష్ణు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది మంచు లక్ష్మి. ఆయన రియాలిటీ వెల్లడించింది. బాలయ్య, మోహన్‌ బాబు ముందే ఆయన గురించి అసలు నిజం చెప్పడం విశేషం. బాలయ్య హోస్ట్ గా చేసిన అన్‌ స్టాపబుల్‌ షోకి మంచు మోహన్‌ బాబు వచ్చారు. ఇది గతేడాదికి సంబంధించిన విషయం. ఇందులో తనకు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో తన పిల్లలు ముగ్గురూ తన మాట దాటరని తెలిపారు. పెద్దలకు రెస్పెక్ట్ చేయాలనేది తన మనవళ్లు, మనవరాళ్లకి కూడా చెబుతానని వెల్లడించారు.

34
బాలయ్య ముందు లక్ష్మి ఓపెన్‌

ఈ క్రమంలో లైవ్‌లోకి మంచు విష్ణు, లక్ష్మి వచ్చారు. ఇందులో పలు నిజాలు వెల్లడించింది లక్ష్మి. బాలయ్య.. మంచు లక్ష్మిని ఒక ప్రశ్న అడిగాడు. మీ నాన్నకి చివరగా చెప్పిన అబద్దం ఏంటని అడగ్గా, ఈ రోజు ఉదయాన్నే చెప్పినట్టు తెలిపింది. నాన్న ఫోన్‌ చేసినప్పుడు అమ్ములు ఎక్కడున్నావ్‌ అంటే, ఇంట్లోనే ఉన్న నాన్న అని తెలిపిందట. కానీ తాను ఇంట్లో లేనని వెల్లడించింది. తాను ఏం చేస్తున్నానని, ఎక్కడికి వెళ్తున్నాననేది మమ్మీకి చెప్పి, డాడీకి చెప్పొద్దని చెప్పి వెళ్తుందట.

44
విష్ణు గురించి నిజాలు చెప్పిన లక్ష్మి

ఆడపిల్లలు తండ్రికి క్లోజ్‌గా ఉంటారని, కొడుకులు తల్లికి క్లోజ్‌గా ఉంటారని బాలయ్య చెప్పగా, తాను అమ్మకి క్లోజ్‌గా ఉంటానని, విష్ణు డాడీకి క్లోజ్‌గా ఉంటాడని తెలిపి షాకిచ్చింది. ఈ సందర్భంగానే మోహన్‌బాబు రియాక్ట్ అవుతూ, లక్ష్మి అబద్దాలు చెబుతుందేమోగానీ, విష్ణు అబద్దాలు చెప్పడు అని వెల్లడించాడు. దీనికి లక్ష్మి రియాక్ట్ అవుతూ, అలా అని అంతా అనుకుంటారు, కానీ నేనైనా మమ్మీకి నిజాలు చెబుతాను, కానీ వీడైతే ఇద్దరికీ నిజాలు చెప్పడు అని ఓపెన్‌గా విష్ణు బండారం బయటపెట్టేసింది. పిచ్చి పిచ్చిగా అబద్దాలు చెబుతాడనేది లక్ష్మి అభిప్రాయం. కానీ ఈ నిజం మీకు(నాన్నకి) తెలియదని ఆమె చెప్పడం గమనార్హం. దెబ్బకి షోలో నవ్వులు విరిసాయి. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories