దీనితో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు దేశం, జనసేన క్యాడర్ జోష్ లో ఉండగా.. వైసిపి నేతలు పవన్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఈ కీలక పరిణామంపై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసింది. 'వావ్ ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత మజా ఇచ్చేలా మారాయి, ఆసక్తికరంగా మారాయి అంటూ పేర్కొంది. దీనితో నెటిజన్లు మంచు లక్ష్మిని.. అసలు మీ ఫ్యామిలీ మద్దతు ఏ పార్టీకి అంటూ ప్రశ్నిస్తున్నారు. మంచు ఫ్యామిలీ విష్ణు, మనోజ్ వర్గంగా విడిపోయింది అంటూ ప్రచారం జరుగుతోంది.