Siima Awards 2023 : సైమా అవార్డ్స్ 2023 వేడుకల్లో ఎన్టీఆర్.. ఈరోజే ప్రారంభం.. నామినేషన్స్ డిటేయిల్స్

First Published | Sep 15, 2023, 2:31 PM IST

సైమా అవార్డ్స్ 2023 వేడుకలు ఈరోజు అట్టహాసంగా జరగనున్నాయి. ఇవ్వాళ, రేపు దుబాయ్ లో గ్రాండ్ నిర్వహించనుండగా.. ఈ వేడుకలకు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా హాజరవుతుండటం విశేషం. 
 

11వ  సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (Siima Awards 2023)  ఈరోజు దుబాయ్ వేదికన అట్టహాసంగా జరగున్నాయి. ఇవ్వాళ, రేపు (సెప్టెంబర్ 15, 16న) గ్రాండ్ గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనుంది. ఈ సాయంత్రం కార్యక్రమం ప్రారంభం కానుంది.
 

ఈ వేడుకలకు గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా హాజరు కాబోతుండటం విశేషం. దీంతో వేడుకలపై మరింత ఆసక్తి నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆస్కార్’ వేడుకల తర్వాత ఎన్టీఆర్ ‘సైమా2023’ వేడుకలకు హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. అలాగే రానా దగ్గుబాటి, మృణాల్ ఠాకూర్, రిషబ్ శెట్టి, రక్షిత్, శ్రీలీలా కూడా హాజరవుతున్నారు. 
 

+


ఈ వేడుక 2022లో విడుదలైన తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ చిత్రాల నుండి బెస్ట్ ఫిల్మ్స్,  బెస్ట్ యాక్టర్, డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్,  లిరిసిస్ట్ లలో విజేతలకు అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రధానమైన కెటగిరీల్లో నామినేషన్లు కూడా అందాయి. 
 

బెస్ట్ ఫిల్మ్ కెటగిరీలో డీజే టిల్లు, కార్తీకేయ 2, మేజర్, ఆర్ఆర్ఆర్, సీతా రామమ్ చిత్రాలు నామినేషన్స్ లో ఉన్నాయి. బెస్ట్ డైరెక్టర్ కెటగిరీలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో పాటు యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి, హను రాఘవపూడి, శశి కిరణ్ తిక్క, విమల్ కృష్ణ పోటీలో ఉన్నారు. 

బెస్ట్ యాక్టర్ కెటగిరీలో టాలీవుడ్ డైనమిక్ హీరో అడివి శేషు, మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నిఖిల్ సిద్ధార్థ, రామ్ చరణ్, సిద్ధు జొన్నలగడ్డ పోటీపడుతున్నారు. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్, నేహా శెట్టి, నిత్యా మీనన్, సమంత, శ్రీలీలా ఉన్నారు. బెస్ట్ సినిమాటోగ్రఫీ, సపోర్టింగ్ రోల్స్, కమెడియన్, నెగెటివ్ రోల్స్ లో నూ ఆయా చిత్రాల నుంచి నటీనటులు నామినేషన్ లో ఉన్నాయి. ఈరోజు సాయంత్రం అవార్డులను ప్రదానం చేయనున్నారు. మిగితా విభాగాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. 

Latest Videos

click me!