ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో పడిన మరో బ్లాక్ బస్టర్ మూవీ 'మనసంతా నువ్వే'. ఆ టైం లో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా వరుస విజయాలు అందుకుంటున్నాడు. మనసంతా నువ్వే చిత్రం ఎప్పుడు చూసినా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఆ చిత్రంలో ఆర్పీ పట్నాయక్ అందించిన సాంగ్స్, సునీల్ కామెడీ.. హీరో హీరోయిన్ల మధ్య సస్పెన్స్ తో కొనసాగే లవ్ ట్రాక్, ఎమోషన్స్ అన్ని హై లైట్ గా నిలిచాయి.