బెడ్‌పై అదిరిపోయే పోజులతో హీరోయిన్‌ మానస వారణాసి.. క్రేజీ ప్రాజెక్ట్ లతో రాబోతున్న ఫెమినా మిస్‌ ఇండియా విన్నర్‌

Published : Jun 14, 2025, 03:33 PM IST

`దేవకి నందన వాసుదేవ` చిత్రంతో అలరించిన మానస వారణాసి ఇప్పుడు సోషల్‌ మీడియా అటెన్షన్‌ మొత్తం తనవైపు తిప్పుకుంది. బెడ్‌ పై పోజులతో రచ్చ చేస్తోంది.  

PREV
18
`దేవకి నందన వాసుదేవ` చిత్రంతో పరిచయమైన మానస వారణాసి

ఫెమినా మిస్‌ ఇండియా విన్నర్‌గా నిలిచి అందరిని దృష్టిని ఆకర్షించింది హీరోయిన్‌ మానస వారణాసి. అంతేకాదు తెలుగులో ఒక సినిమా కూడా చేసింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ  మనవడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ గల్లా హీరోగా రూపొందిన `దేవకి నందన వాసుదేవ` చిత్రంలో హీరోయిన్‌గాా నటించింది మానస.

28
ప్రశాంత్‌ వర్మ కథ అందించిన చిత్రంతో మానస ఎంట్రీ

ఈ మూవీతో తెలుగు ఆడియెన్స్ కి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.  అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ కథ అందించడం విశేషం. గతేడాది విడుదలైన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కానీ కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు.

38
పల్లెటూరి పిల్ల సత్యగా అలరించిన మానస

ఇందులో పల్లెటూరి పిల్ల సత్యగా నటించి మెప్పించింది మానస వారణాసి. తనదైన అందంతో, అభినయంతో, ఇన్నోసెంట్‌ లుక్‌లో ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో మానసకి వరుసగా ఆఫర్లు రాలేదు. 

48
`కపుల్‌ ఫ్రెండ్లీ` సినిమాతో రాబోతున్న మానస

కానీ కాస్త లేట్‌ అయినా నెమ్మదిగా ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పుడు సంతోష్‌ శోభన్‌తో కలిసి హీరోయిన్‌గా ఓ మూవీ చేస్తోంది. `కపుల్‌ ఫ్రెండ్లీ` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండటం విశేషం. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళంలో ఇది రిలీజ్‌ కానుంది.

58
హైదరాబాద్‌లోనే పుట్టిన మానస

హైదరాబాద్‌కి చెందిన మానస వారణాసి స్కూలింగ్‌ అంతా ఇక్కడే చేసింది. గ్లోబల్‌ ఇండియన్‌ ఇంటర్నేషన్‌ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత వారి ఫ్యామిలీ మలేషియాకి షిఫ్ట్ అయ్యారు. దీంతో ఇంటర్‌ వరకు అక్కడే చదువుకుంది. వాళ్లు మళ్లీ ఇండియా వచ్చారు. వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్ చేసింది. కొన్నాళ్లపాటు జాబ్‌ కూడా చేసింది.

68
ఫెమినా మిస్‌ ఇండియా 2020 విన్నర్ గా మానస

కాలేజీ రోజుల నుంచే మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. పలు అందాల పోటీల్లో పాల్గొంది. మిస్‌ తెలంగాణ 2019లో పాల్గొని మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2020లో మరోసారి పోటీ పడి మిస్‌ తెలంగాణ 2020 విన్నర్‌గా నిలిచింది. అదే ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా 2020 పోటీల్లో పాల్గొని విజేత అయ్యింది.

78
హీరోయిన్‌గా బిజీ అవుతున్న మానస

అట్నుంచి సినిమా ప్రయత్నాలు చేయగా, `దేవకి నందన వాసుదేవ` చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. `కపుల్‌ ఫ్రెండ్లీ` చిత్రంతో ఆడియెన్స్ ని అలరించేందుకు రెడీ అవుతుంది. దీంతోపాటు పలు క్రేజీ ప్రాజెక్ట్‌లకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

88
బెడ్‌పై గ్లామర్‌ పోజులతో మానస రచ్చ

ఇక ఇప్పుడు సోషల్‌ మీడియా అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది మానస. బెడ్‌పై హోయలు పోతూ దిగిన ఫోటోలు నెటిజన్లని చూపుతిప్పుకోనివ్వడం లేదు. మేకర్స్ దృష్టిలో పడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఈ మానస పిక్స్ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories