Neetu Chandra: వ్యాపారవేత్త నెలకు 25 లక్షలు ఇస్తా భార్యగా ఉండమన్నాడు... నాగార్జున హీరోయిన్ సంచలన ఆరోపణలు!

Published : Jul 14, 2022, 05:19 PM ISTUpdated : Jul 14, 2022, 05:27 PM IST

పరిశ్రమకు చెందిన అమ్మాయిలంటే అందరికీ లోకువే. హీరోయిన్స్ తో పాటు లేడీ యాక్టర్స్ లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారు. ఇక సక్సెస్ లేని వాళ్ళను మరింత నీచంగా చూస్తారు. తెలుగులో విష్ణు, గోదావరి, సత్యమేవ జయతే చిత్రాల్లో నటించిన నీతూ చంద్రకు ఓ చేదు అనుభవం ఎదురైందట. 

PREV
16
Neetu Chandra: వ్యాపారవేత్త నెలకు 25 లక్షలు ఇస్తా భార్యగా ఉండమన్నాడు... నాగార్జున హీరోయిన్  సంచలన ఆరోపణలు!
Neetu Chandra

2003లో మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా పరిచయమవుతూ విష్ణు టైటిల్ తో మూవీ విడుదలైంది. ఈ చిత్రంతో నీతూ చంద్ర నటిగా వెండితెరకు పరిచయయ్యారు. తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గోదావరి చిత్రంలో కీలక రోల్ చేశారు. అలాగే రాజశేఖర్ సత్యమేవ జయతే మూవీ చేయడం జరిగింది. 

26
Neetu Chandra

అవేమి ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. ఎక్కువగా హిందీలో చిత్రాలు చేశారు. ఆమె నటించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. చాలా గ్యాప్ తర్వాత 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ మనం మూవీలో ఎయిర్ హోస్టెస్ గా కనిపించింది. నీతూ చంద్ర చివరిగా కనిపించిన తెలుగు చిత్రం మనం కావడం విశేషం. 

36

2017లో వరుసగా  మూడు చిత్రాలు చేసిన నీతూ చంద్ర(Neetu Chandra) గత ఏడాది ఓ హాలీవుడ్ మూవీ చేశారు. ఐతే ఆమె కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ క్రమంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన నీతూ చంద్ర ఓ సంచలన విషయం బయటపెట్టారు. 

46

ఆమె మాట్లాడుతూ... నాది ఓ సక్సెస్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ. నేను గొప్ప గొప్ప నటులతో పని చేశాను. వారిలో 13 మంది నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద చిత్రాల్లో నటించాను. అలాంటి నాకు ఇప్పుడు సినిమాలు లేవు. ఓ వ్యాపార వేత్త శాలరీడ్ వైఫ్ గా ఉండమన్నాడు. తన భార్యగా ఉంటే నెలకు రూ. 25 లక్షలు ఇస్తానన్నాడు. 

56

డబ్బులు లేవని, అవకాశాలు లేవని నా నిస్సహాయత చూసి ఆయన అలాంటి ఆఫర్ ఇచ్చారు. ఇన్ని మంచి సినిమాల్లో నటించి కూడా నాకు ఈ పరిస్థితి రావడం దారుణం. ఒకవేళ నేను ఇక్కడ ఉండడం సరికాదేమో... అంటూ నీతూ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీతూ చంద్ర కామెంట్స్ పతాక శీర్షికలకు ఎక్కాయి.  

66
neetu chandra

బీహార్ కి చెందిన నీతూ చంద్ర గరం మసాలా, ట్రాఫిక్ సిగ్నల్, వన్ టూ త్రీ, అపార్ట్మెంట్ 13 బి చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్, మిథిలా మఖాన్ చిత్రాలు జాతీయ అవార్డ్స్ అందుకున్నాయి. 

click me!

Recommended Stories